రంగారెడ్డి

అట్టహాసంగా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మార్చి 24: మండలంలోని మైసమ్మగూడ గ్రామ పరిధిలో గల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల 17వ వార్షికోత్సవాన్ని శనివారం రాత్రి ‘రెసోనెన్స్ 2కే19’ పేరుతో ఆట్టహాసంగా నిర్వహించారు. రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి సతీమతి కల్పనా రెడ్డి, కాలేజీ కార్యదర్శి మంత్రి మల్లారెడ్డి తనయుడు మహేందర్ రెడ్డి భార్య శాలినీ రెడ్డి డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి పాల్గొని వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ రెడ్డి కార్యక్రమంలో కళాశాల నివేదికను చదివి వినిపించారు. హెచ్‌పీ డెవాన్స్ లాంటి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల పై విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన ప్రాంగణ నియామకాలను అందజేస్తున్నామని వివరించారు. పది లక్షల వార్షిక జీతానికి ఓ విద్యార్థికి ఉద్యోగం లభించడం గర్వంగా ఉందని అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్స్ రామస్వామి రెడ్డి, నారాయణ పాల్గొన్నారు.
అంబేద్కర్ జాతర నూతన కార్యవర్గం ఎన్నిక
షాద్‌నగర్ రూరల్, మార్చి 24: అంబేద్కర్ జాతర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం షాద్‌నగర్ ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో అంబేద్కర్ జాతర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు రాయికంటి రాందాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ సింగిరెడ్డి పరమేశ్వర్, స్టీరింగ్ కమిటీ కో కన్వీనర్ బీ.సిద్ధార్థ, సింగపాగ జంగయ్యలు పాల్గొని సమావేశాన్ని నిర్వహించారు. 20వ అంబేద్కర్ జాతరను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 128వ జయంతిని పురస్కరించుకొని నిర్వహించనున్న జాతరకు భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
నియోజకవర్గ అధ్యక్షుడిగా జాంగారి రవి, ఉపాధ్యక్షుడిగా రాంచందర్, వై.వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా జిల్లెల జంగయ్య, కోశాధికారిగా ఎం.రమేష్, సహాయ కార్యదర్శిగా శ్రీను, సలహాదారుగా ఎం.లక్ష్మయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.