రంగారెడ్డి

ఖజానాకు గండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మార్చి 24: అనుమతుల్లేని బహుళ అంతస్థుల నిర్మాణాలకు కేరాఫ్‌గా మల్లంపేట్ మారింది. యథేచ్ఛగా ఐదారంతస్థుల నిర్మాణాలను ఎలాంటి డీవియేషన్‌లను పాటించకుండా నిర్మిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుందిగల్ మున్సిపల్ పరిధిలోని మల్లంపేట్ గ్రామంలో జీ ప్లస్ 2 కి గ్రామ పంచాయతీ అనుమతిని పొంది విచ్చలవిడిగా ఐదారంతస్థులను నిర్మిస్తున్నా మున్సిపల్ అధికారులకు ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరించడం విశేషం. గ్రామ పంచాయతీ పాలక వర్గం ముగిసి సుమారు ఆరు నెలలకు పైగా కావస్తున్నా ఇంకా పంచాయతీ అనుమతులు జారీ అవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాత తేదీల్లో అనుమతులను పొంది కొంతమంది బిల్డర్‌లు బహుళ అంతస్థులను నిర్మిస్తున్నారనే విమర్శలు నెలకొన్నాయి. మల్లంపేట్ గ్రామ పంచాయతీ పోయి దుందిగల్ మున్సిపాలిటీలో కలిసింది. కనీస నియమ నిబంధనలను, సెట్‌బ్యాక్‌లను ఏ మాత్రం వదిలి పెట్టకుండా అనుమతుల్లేకుండానే ఐదంతస్థుల భవనాలు వెలుస్తున్నాయి. అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న బహుళ భవనాల వల్ల దుందిగల్ మున్సిపల్ ఖజానాకు భారీ స్థాయిలో గండిపడుతుంది. మున్సిపల్ నామ్స్ ప్రకారం అనుమతులను పొంది భవనాలను నిర్మిస్తే అటు మున్సిపల్‌కు ఆదాయం లభిస్తుంది. మల్లంపేట్ గ్రామంలో ఆంధ్రాబ్యాంక్ వెనుక , ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే దారిలో యథేచ్ఛగా ఐదంతస్థుల బహుళ అంతస్థుల భవనాలను నిర్మిస్తున్నారు. జీ ప్లస్ టూనిర్మాణాలకు అనుమతులు పొంది యథేచ్ఛగా ఐదంతస్థుల భవనాలను నిర్మిస్తూ కనీసం బెటర్మెంట్ చార్జీలు లేకుండా లబ్ధిపొందుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొంతమంది వ్యక్తులు అనుమతులు లేకుండానే సెల్లార్‌ల నిర్మాణం చేపడుతూ బహుళ భవనాలను నిర్మిస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఆమ్యామ్యాలకు అలవాటు పడి అనుమతులు లేకుండా ఐదంతస్థుల వరకు భవనాలను నిర్మిస్తున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు తారస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలకు కనీసం నోటీసులను జారీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.