రంగారెడ్డి

మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, మార్చి 24: మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కౌర్ వ్యాఖ్యానించారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి పాలనను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. మోదీ, కేసీ ఆర్‌లు కుమ్మక్కై దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని నవజ్యోతి యూత్‌క్లబ్‌లో ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 2వ మహాసభలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దేశ ప్రధాని మోదీని ఉద్దేశించి చురకలంటించారు. మోదీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. మోడీ అధికారం చేపట్టాక దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా అట్టడుగు స్థాయికి దిగజారిందని ధ్వజమెత్తారు. ప్రజల సొమ్మును దోచుకున్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటివారిని దేశం నుంచి పారిపోవడానికి నరేంద్ర మోదీ సహకరించారని ఆరోపించారు. నోట్ల రద్దు ప్రక్రియతో దేశంలో ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోయిందని మండిపడ్డారు. నోట్ల రద్దు, జీఎస్టీతో సుమారు 70 లక్షల మంది ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఆరు కోట్ల మంది కార్మికులు ఉద్యోగాలు పోయి రోడ్డున పడ్డారని వివరించారు. దేశాన్ని దోచి కార్పొరేట్ సంస్థలకు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర నిఘా సంస్థలు, ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినప్పటికీ పుల్వామా జవాన్లను కాపాడటంలో వైఫల్యం చెందారని మండిపడ్డారు. దీంతో పాటు పైలెట్ అభినందన్.. పాకిస్థాన్‌లో పడ్డారని, అతనితో పాటు మరొక పైలెట్ కూడా ఉన్నారని, అతడిని మాత్రం వెనక్కి ఎందుకు తీసుకురాలేదని మోదీని సూటిగా ప్రశ్నించారు. కేవలం రాజకీయంగా లబ్ధిపొందేందుకే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో కలిసి ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్వామ బాధిత సైనికుల కుటుంబాలకు పాత పద్ధతిలో పెన్షన్‌ను ఇచ్చి ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. రైతులు, కళాకారులు, కార్మికులను దేశ ద్రోహులుగా, దేశాన్ని దోచుకున్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను దేశభక్తులుగా బీజేపీ ప్రభుత్వం చిత్రీకరించడం పట్ల ఆక్షేపించారు. గుజరాత్‌లో ప్రధాని మోదీ రూ.3వేల కోట్లు వెచ్చించి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పెట్టించారని, దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మా గాంధీని ఎలా విస్మరించారని ప్రశ్నించారు. స్వచ్ఛ భారత్‌లో కళ్ల అద్దాలను మాత్రమే పెట్టి, వల్లభాయ్ పటేల్‌కు మాత్రం విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహన్, నాయకులు రత్నాకర్ రావు, బాల్‌రాజ్, చంద్రయ్య, సీతారామయ్య, రాజిరెడ్డి, ప్రేమ్‌పావని, శ్యామల, గంగాధర్ రెడ్డి, నారాయణ రెడ్డి, ప్రసాద్, యూసుఫ్ పాల్గొన్నారు.