రంగారెడ్డి

ఉప్పల్ భగాయత్ ప్లాట్ల ఈ-వేలంపై అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మార్చి 25: ఉప్పల్ భగాయత్ ఫేజ్- 2లేఔట్‌లోని మల్టీ జోన్ ప్లాట్ల ఈ-వేలంపై అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి పాల్గొన్న హెచ్‌ఎంటీఏ కార్యదర్శి ఎం.రాంకిషన్ మాట్లాడుతూ నగరంలో ఇంటి స్థలం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సదవకాశామని, ఎలాంటి వివాదాలు లేని నియమ నిబంధనలకు అనుగుణంగా అన్ని వౌలిక వసతులతో కూడిన ప్లాట్లను హెచ్‌ఎండీఏ ఈ-వేలం చేస్తుందని అన్నారు. రానున్న ఏప్రిల్ 7, 8 తేదీల్లో నిర్వహించనున్న ఈ-వేలంలో పాల్గొనే ప్లాట్ల కొనుగోలు దారులు హెచ్‌ఎంటీఏ కార్యాలయానికి రాకుండానే ఈ-వేలం/ ఈ-టెండర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ విధానాన్ని ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. హెచ్‌ఎండీఏ తార్నాక కార్యాలయంతో పాటు మరో 3 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో ఓఆర్‌ఆర్ పీడీ అశోక్ కుమార్, ఈఓ గంగాధర్, సీఏఓ శరత్ చంద్ర, డైరెక్టర్ నరేంద్ర, ఈఈ యూసుఫ్ హుస్సేన్, ప్లానింగ్ ఆఫీసర్ సత్యనారాయణ మూర్తి, పీఆర్‌ఓ విజిత, డీఏఓ సరస్వతి పాల్గొన్నారు.