రంగారెడ్డి

రాయదుర్గంలో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, మార్చి 25: రాయదుర్గంలోని షాగౌస్ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం 11.30 సమయంలో ప్రమాదం జరగింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. భోజనం సమయంలో జరిగి ఉంటే పరిస్థతి మారోలాగా ఉండేదని స్థానికులు వాపోయారు. ఫైర్, పోలీసు అధికారుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాయదుర్గంలోని షాగౌస్ హోటల్ వంట గదిలోని ఎక్జాస్టార్ ఫ్యాన్‌కు ఉన్న విద్యుత్ వైర్లలో ఏర్పడిన షార్ట్ సార్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. మంటలు వంట గదికి మొత్తం వ్యాపించడంతో హోటల్‌లో పని చేసేవారు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తు ఫైర్ స్టేషన్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. భారీగా మంటలు వ్యాపించడంతో పాటు దట్టమైన పొగలు రావడంతో రోడ్డుపైన వెళ్తున్న ప్రయణికులు ఆగి చూడడంతో ట్రాఫిక్ స్తంభించింది. రాయదుర్గం సీఐ రవీంద్రర్ తన సిబ్బందితో సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు. ఫైర్ అధికారులు చేరుకుని మంటలను అదుపుచేశారు. అగ్నిమాపక శాఖ అధికారులు సకాలంలో రావడం మంటలు పైఅంతస్థుకు పాకకుండా చూడడంతో ఆస్తి నష్టం తగ్గింది. ప్రమాదం ఉదయం వేళలో జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రోజుకు సగటున 1500 మందికిపైగా షాగౌస్ హోటల్‌లో భోజనానికి వస్తారు. అగ్నిప్రమాదం సంఘటనతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ఏడీసీపీ అమర్‌కాంత్ రెడ్డి సిబ్బంది చేరుకుని ట్రాఫిక్‌ను మళ్లించారు. మాదాపూర్ ఫైర్ ఆపీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎక్జాస్టార్ ఫ్యాన్ వద్ద షార్ట్‌సార్క్యూట్‌తో మంటలు వ్యాపించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంతో రెండు లక్షల రూపాయల మేర ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని తెలిపారు. సకాలంలో హోటల్ సిబ్బంది స్పందించడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని రాయదుర్గం సీఐ రవీంద్ర తెలిపారు.