రంగారెడ్డి

వైభవంగా వేంకటేశుని కల్యాణ మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మార్చి 26: అత్వెల్లి వేంకటేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవం సోమవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీఅలివేలు మంగ సమేత వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను ఐదు రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం రాత్రి స్వామివారి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హజరై ఎంతో భక్త్భివంతో కల్యాణ తంతును తిలకించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీఅలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామివారి కల్యాణాన్ని శ్రాస్తోక్తంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించారు. రథోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు ఆలయ కమిటీ పేర్కొంది.