రంగారెడ్డి

భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, : ప్రతి ఒక్కరూ దైవభక్తిని కలిగి ఉండాలని అప్పుడే మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని కొత్తూరు ఎంపీపీ శివశంకర్ గౌడ్ అన్నారు. శుక్రవారం నందిగామ మండలం చేగూర్ గ్రామంలో హనుమాన్ సాయి యూత్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంకాల యాదయ్య ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఉప సర్పంచ్ సురేష్ గౌడ్, వార్డు సభ్యులు మల్లపురం యాదయ్య, రవి, కావలి మధు, మల్లేష్‌గౌడ్, మంచనపల్లి కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
షాద్‌నగర్ రూరల్: హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా పట్టణంలోని పటేల్‌రోడ్డులోని శ్రీఅభయాంజనేయ స్వామి దేవాలయంలో కౌన్సిలర్ చెన్నయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెన్నయ్య మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రజల్లో దైవభక్తి తగ్గిపోయిందని, దాంతో మనస్సుకు ప్రశాంతత అనేది లేకుండా పోయిందని వివరించారు. ఫరూఖ్‌నగర్ మండలం దేవునిపల్లి గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. శుక్రవారం స్థానిక సర్పంచ్ చేగూరి రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పట్టణ సమీపంలోని చౌడమ్మగుట్ట శ్రీఅభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. షాద్‌నగర్ బీవీరావు ఫౌల్ట్ఫ్రిం యజమాని గుదే వసంత రావు ఆర్థిక సహకారంతో అన్నదానం ఏర్పాటు చేశారు. ఎన్‌ఎస్‌యూఐ నేతలు దినేష్‌సాగర్, మధు, మనె్న రవి, లడ్డు, భాస్కర్, సుధీర్, ఉదయ్, గుదే సతీష్, గంజ్ చెన్నారెడ్డి, మక్కల శ్రీనివాస్‌రెడ్డి, మలినే సాంబశివరావు, పాతూరి సత్యనారాయణ, నక్కబాల్‌రాజ్, మోహన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
పట్టణంలోని శ్రీనగర్‌కాలనీలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో కౌన్సిలర్ యుగంధర్ ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కౌన్సిలర్ యుగంధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని, అప్పుడే మనస్సుకు ప్రశాంతత అనేది లభిస్తుందని వివరించారు. కార్యక్రమంలో కాలనీ వాసులు గన్నోజు అంజయ్య, చందు, గోపాల్, పుల్లన్నచారి, బాల్‌రాజ్, రాములు పాల్గొన్నారు.
నెహ్రూనగర్ కాలనీలోని హనుమాన్ దేవాలయంలో షాద్‌నగర్ పురపాలిక సంఘం చైర్మన్ అగ్గనూరి విశ్వం ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పాలమాకుల చెన్నయ్య, సత్యనారాయణ, మురళీమోహన్, బండారి భరద్వాజ్, బల్లు, చల్లా రవి, మనోహర్‌రాజు, అంజయ్య, ముత్యాలు, అకెటి రాజశేఖర్ పాల్గొన్నారు.
బాలాపూర్: శ్రీవీరాంజనేయ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం బాలాపూర్ మండలం, సరూర్‌నగర్, ఆర్‌కేపురం డివిజన్ల నుంచి పలువురు భారీ ర్యాలీలు నిర్వహించారు. బాలాపూర్ శ్రీహనుమాన్ దేవాలయం నుంచి బీజేపీ సీనియర్ నాయకుడు కోలన్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడి నుంచి బాలాపూర్ దేవతలగుట్ట వరకు హనుమాన్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. హిందూ అనేది ఒక మతం కాదని, హిందూ అనేది ఒక ధర్మం, ఒక జీవనవిధానం అని అన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలం నాదర్‌గుల్ గ్రామం నుంచి స్టార్ యూత్ ఆధ్వర్యంలో భారీ వీరహనుమాన్ విగ్రహన్ని ఏర్పాటుచేసి, ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి మహేశ్వరం బీజేపీ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించి ప్రంగించారు. స్టార్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ హనుమాన్ విగ్రహం పలువురిని ఆకట్టుకుంది. కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం నుంచి తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయం వరకు నిర్వహించిన హనుమాన్ ర్యాలీలో రంగారెడ్డి జిల్లా బీజేపీ స్పోర్ట్స్ కన్వీనర్ రామిడి శూరకర్ణ రెడ్డి తన అనుచరులతో పాల్గొన్నారు.
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్‌లో హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా హనుమాన్ శోభాయాత్రను నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీర హనుమాన్ ఆశీస్సులు పొందారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ నుంచి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర నగరంలోని తాడ్‌బండ్ వరకు కొనసాగింది. శోభాయాత్ర మైలార్‌దేవ్‌పల్లి, అరాంఘర్, దుర్గానగర్, ఉప్పర్‌పల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్‌ల మీదుగా నగరంలో జరుగనున్న భారీ శోభాయాత్రలో కలిసింది.
మైలార్‌దేవ్‌పల్లిలో కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి.. హనుమాన్ దేవాలయంలో నిర్వహించిన బాలరామకృష్ణ భక్త భజన మండలిలో ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ జయంతి ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు.