రంగారెడ్డి

మధ్యాహ్నం ఎండ.. సాయంత్రం వర్షంతో కూల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెహిదీపట్నం, ఏప్రిల్ 20: మధ్యాహ్నం ఎండ వేడిమితో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కానీ, సాయంత్రం నాలుగు గంటలకు చిరుజల్లులతో జనం ఉపశమనం పొందారు. కొన్ని రోజులు ఉదయం ఎనిమిది గంటలకే ఎండ మండిపోతుంది. మధ్యాహ్నం తీవ్రత పెరుగుతోంది. మూడు రోజులుగా మధ్యాహ్న వేళలో రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. రోడ్లుపై ఏర్పాటు చేసిన బండ్లపై జనం చల్లని పానీయాలు తాగి కొంత మేరకు ఉపశమనం పొందుతున్నారు. చల్లని పానీయాలతో గొంతులో ఇన్‌ఫెక్షన్ వస్తున్నాయిని పలువురు డాక్టర్లు పేర్కొన్నారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సాయంత్రం నగరంలో పలు ప్రాంతాలలో చిరుజల్లులు కూరిసాయి. రెండు రోజులు ఒక్కసారైనా వర్షం పడితే బాగుంటుందని జనం వాపోతున్నారు.
పెరుగుతున్న చైతన్యం.. తొలగుతున్న పూడిక
బొంరాస్‌పేట, ఏప్రిల్ 20: ఒండ్రు మట్టిని తమ పొలాలకు తరలించేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. సోమవారం ఒక్కరోజే మండల పరిధిలోని రేగడి మైలారం గ్రామంలోని కుంటలో పూడిక తీసేందుకు రెండు వందలకుపైగా కూలీలు హాజరైయ్యారు. పొలాలు సారవంతం కావడంతో పాటు కూలీ కూడ లభిస్తుండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కుంటల్లో పేరుకుపోయిన ఒండ్రు తొలగుతోంది. అడపాదడపా కురిసే వర్షాలకు చెరువులు, కుంటల్లోకి నీరు చేరితే ఒండ్రుమట్టిని తరలించే పరిస్థితి ఉండదన్న ఉద్దేశంతో ఉపాధిలో ఇతర పనులను వదిలి ఒండ్రుమట్టి తరలించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఉపాధిలో ఒండ్రుమట్టి తరలింపుపనులను ఎంపీడీఓ హరినందన్ రావు పరిశీలించారు. ఒండ్రుమట్టిని పొలాలకు తరలించి వేసవి దుక్కులు దున్నుకోవడం ద్వారా పొలాలు సారవంతమవడంతో పాటు పంట దిగుబడులు పెరుగుతాయని అన్నారు.