రంగారెడ్డి

తాండూరులో రెండో విడతలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, ఏప్రిల్ 20: ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన నేపథ్యంలో తాండూరు నియోజకవర్గంలో మే 10న రెండవ విడతలో ఎన్నికలు నిర్వహించ నున్నట్లు అధికారులు వెల్లడించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో మొత్తం 53 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 149 గ్రామ పంచాయతీలకు సంబంధించి 53 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. నాలుగు జడ్పీటీసీ స్థానాలలో రెండవ విడత మే 10న ఎన్నికలు జరుగనున్నాయి.
రాజకీయం పట్ల ఆసక్తి ఉంది
కానీ పదవికాంక్ష లేదు
* ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తిరెడ్డి ఉద్ఘాటన
తాండూరు, ఏప్రిల్ 20: రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది కానీ పదవీకాంక్ష మాత్రం లేదని స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తిరెడ్డి ఉద్గాటించారు. శనివారం ఓ కార్యక్రమం సందర్భంగా మిడియాతో మాట్లాడుతూ తమ కుటుంబంలో తన భర్త వ్యాపార, ఐటి, తదితర రంగాల్లో రాణించారని, రాజకీయాల్లో ఆసక్తి కనబర్చి ఓ పార్టీలో చేరిన మూన్నాళ్లకే ఆ పార్టీ విధానాలు, నాయకులు ఒంటెత్తు పోకడలను జీర్ణించుకోలేక.. కాంగ్రెస్‌లో చేరారని తెలిపారు. జడ్పీటీసీగా పోటీ చేస్తున్నట్లు వస్తున్న ఊహాగానాలు చూసి విస్తుపోతున్నట్లు ఆర్తిరెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
పరిషత్‌లలో టీఆర్‌ఎస్‌దే పాగా
తాండూరు, ఏప్రిల్ 20: రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్ని స్థానాలు టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం పట్నం తాండూరులోని నివాసంలో పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. వికారాబాద్ జిల్లాలోని 18 జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకోవటంతో పాటు, రంగారెడ్డి జిల్లాలోని 21 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల్లో తమ పార్టీ అఖండ విజయం సాధించబోతుందని పట్నం జ్యోస్యం చెప్పారు. సునీతా మహేందర్ రెడ్డి ప్రస్తుత ఎన్నికల్లో మరోసారి జడ్పీటీసీగా ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారన్న ప్రశ్నకు పట్నం స్పందిస్తూ సునీతా రెడ్డి అయినా, మరోకరైనా పార్టీ అగ్రనాకత్వం అభీష్టం మేరకు ఆయా స్థానాలకు పోటీలో ఉంటారని పునరుద్గాటించారు. రాష్ట్ర నేత కరణం పురుషోత్తం రావు పాల్గొన్నారు.