రంగారెడ్డి

వడదెబ్బకు బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఏప్రిల్ 20: వడదెబ్బతో ఓ బాలుడు మృతిచెందిన సంఘటన మండలంలోని శ్రీరంగవరం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పెద్దులు, సాయమ్మ దంపతులు కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు కృష్ణ(12) ఇదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలకు సెలవులు కావడంతో తల్లితండ్రి తమతో పాటే కృష్ణను కూలీ పనికి తీసుకెళ్లసాగారు. కృష్ణ మండుటెండలో పని చేయడంతో మూడు రోజుల క్రితం వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శుక్రవారం కృష్ణను ఇదే గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. శనివారం తెల్లవారుఝామున కృష్ణ మృతిచెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలని పలువురు నాయకులు విఙ్ఞప్తి చేశారు.