రంగారెడ్డి

అన్నా ప్లీజ్.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఏప్రిల్ 20: త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల పోరు పల్లెల్లో జోరందుకుంది. నోటిఫికేషన్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉండటంతో పార్టీలన్నీ ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి. స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. మరోవైపు వివిధ పార్టీల నేతలు వ్యూహాల్లో మునిగిపోయారు. పార్టీ గుర్తులపై ఎన్నికలు జరుగుతున్నందున ఆయా రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మాదిరిగానే స్థానిక సంస్థల్లో విజయం సాధించాలని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా పోటీచేసే అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన బాధ్యత నియోజకవర్గ ఎమ్మెల్యేకు బాధ్యతలు అప్పగించారు. దాంతో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులంతా ఇదే పనిలో మునిగిపోయారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, ఇతర పార్టీలు కూడా ఈ ఎన్నికలను సీరియస్‌గానే తీసుకొని ముందుకు వెళ్తున్నాయి. అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేసింది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను సాధించిన విషయం అందరికీ తెలిసిందే.
షాద్‌నగర్ డివిజన్‌లోని ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను పెద్ద సంఖ్యలో కైవసం చేసుకుంది. అప్పటికే రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన టీఆర్‌ఎస్ నుంచి ఆశించిన స్థాయిలో అభ్యర్థులు విజయం సాధించలేకపోయారు. నియోజకవర్గంలోని నాలుగు మండల పరిషత్, నాలుగు జిల్లా పరిషత్ ప్రాధేశిక స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎన్నికల వరకు వేచి చూడాల్సిందేనని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు.
నేతలకు సవాల్‌గా ఎంపిక
స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాజకీయ నేతలకు సవాల్‌గా మారిందని చెప్పవచ్చు. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు కత్తిమీద సాములా మారిందని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ముందు అధికార పార్టీ ఆయా పార్టీల నుంచి భారీ ఎత్తున నేతలను చేర్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. దాంతో ఒక్కో స్థానం నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఆశించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తమ విషయం ముందే తేల్చేయాలని కొందరు నేతలు ముఖ్య నాయకులను డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ దారి తాము చూసుకుంటూ ఇతర పార్టీల నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో అధికార పార్టీ నుండి అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో నేతలు ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థుల వివరాలను ముందే ప్రకటిస్తే మిగతా నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతారేమోననే భయంతో ప్రకటించేందుకు కొంత ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వామపక్ష పార్టీల నుంచి కూడా ఎక్కువ మంది ఎంపీటీసీ, జడ్పీటీసీ టికెట్‌లను ఆశిస్తున్నారు. ప్రాదేశిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ముందే ఖరారు చేసిన నేపథ్యంలో టికెట్‌ల విషయంలో మరింత ఒత్తిడి పెరిగిందని నేతలు పేర్కొంటున్నారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండడంతో అభ్యర్థుల ఎంపికపై నేతలు దృష్టి ఎక్కువగా కేంద్రీకరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒక్కసారి అవకాశం ఇవ్వండీ అన్నా.. అంటూ ఆశావహులు టికెట్లు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక్కో స్థానానికి అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు నేతల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ప్లీజ్ అన్నా.. ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ముఖ్య నేతల చుట్టూ ఆశావహులు ప్రదక్షిణలు కొనసాగిస్తున్నారు. గత సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందిన నేతలు ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో పోటీదారుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అవకాశం కల్పించాలంటూ పార్టీ అధిష్ఠానాల వద్దకు గ్రామీణ నేతలు పరుగులు తీస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో స్థానిక నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేతలు ఎక్కువగానే ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.