రంగారెడ్డి

రేవంత్ రెడ్డిని కలిసిన మేడ్చల్ కాంగ్రెస్ నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఏప్రిల్ 21: మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎనుముల రేవంత్ రెడ్డిని ఆదివారం నగరంలోని ఆయన నివాసంలో మేడ్చల్ కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛాన్ని అందించి అభినందించారు. విజయం ఖాయమని నాయకులు ధిమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు వరదారెడ్డి, బాల్‌రెడ్డి, సత్యనారాయణ, రాజు, శ్రీనివాస్ గౌడ్, నాగేశ్, రమేశ్ పాల్గొన్నారు.
రెడ్డి సంక్షేమ పొదుపు సంఘం
సర్వసభ్య సమావేశం
రాజేంద్రనగర్, ఏప్రిల్ 21: రెడ్డి సామాజికవర్గంలో ఇబ్బందులు పడుతున్న పేదవారిని ఆదుకోవడానికి రెడ్డి సంక్షేమ పొదుపు సంఘం ఎంతో సహాయపడుతుందని రెడ్డి సంక్షేమ పొదుపు సంఘం సభ్యులు వెల్లడించారు. ఆదివారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ టీ ఎన్జీవోఎస్ కాలనీ, మధుబన్‌కాలనీ, పద్మశాలిపురానికి చెందిన రెడ్డి సంక్షేమ పొదుపు సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఆరో సర్వసభ్య సమావేశ మహాసభ నిర్వహించారు. వారు ప్రస్తుతం కొనసాగుతున్న వార్షిక ఆదాయ, వ్యయ వివరాలను ఆడిట్ పుస్తకాలను సభ్యులకు వివరించారు. సంఘం అభివృద్ధి గురించి సభ్యులందరు చర్చించుకొని తీర్మానించుకున్నారు. సంఘాన్ని ప్రారంభించినప్పుడు 151 మందితో ప్రారంభమైన సంఘం 652 మంది నమోదు కావడం జరిగిందని అన్నారు. సభ్యులందరూ బ్యాంకుల కంటే అతి తక్కువ వడ్డీకి అవసరమైన సమయానికి అందజేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు, అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులందరి అంగీకరంతో పలు తీర్మానాలను అంగీకరించారు.
చేవెళ్లలో టీఆర్‌ఎస్ విజయకేతనం
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 21: చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచి అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పాటుపడతారని చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి పేర్కొన్నారు. ఏపీలోని పొన్నూరు ఆంజనేయ స్వామి, విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయాల్లో చందానగర్ డివిజన్ ముఖ్య నేతలు, వార్డు సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు, బూత్ కమిటీ సభ్యులతో కలిసి కార్పొరేటర్ నవత రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి విజయకేతనం ఎగరేయాలని, చందానగర్ డివిజన్ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, అభివృద్ధిలో ముందంజలో ఉండి ఆదర్శంగా తయారు చేయడానికి మరింత శక్తినివ్వాలని ఆంజనేయ స్వామి, కనకదుర్గమ్మను వేడుకున్నామని కార్పొరేటర్ నవత రెడ్డి తెలిపారు. టీఆర్‌ఎస్ నేత విజయ్ రెడ్డి, శ్రీకాంత్ ఇతర నాయకులు పాల్గొన్నారు.