రంగారెడ్డి

పల్లెల్లో పశుగ్రాసం కొరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేశంపేట, ఏప్రిల్ 21: ఎండల తీవ్రత, వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో మూగజీవాలకు పశుగ్రాసం లభించక అన్నదాతలు ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా పశుగ్రాసం లభించకపోవడంతో ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఎండల వేడిమి, తాగునీటి సమస్య నుంచి మూగజీవాలను రక్షించేందుకు అన్నదాతలు ఎన్నో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
తాగునీటి సమస్య, పశుగ్రాసం కొరతతో మూగజీవాలను కబేళాలకు తరలించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని అన్నదాతలు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో నిర్మించిన నీటి తొట్లు అలంకార ప్రాయంగా మారాయే తప్ప ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని చెప్పవచ్చు. వర్షాభావ పరిస్థితులతో వరిసాగు విస్తీర్ణం ప్రతి ఏటా తగ్గిపోతోంది. మొన్నటి యాసంగిలో వరిసాగును చేయవద్దని వ్యవసాయ శాఖ అధికారులు సైతం రైతులకు సూచించారు. దాంతో గతం కంటే వరిసాగు ప్రస్తుతం గణనీయంగా తగ్గిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో వరిగడ్డికి పెద్దఎత్తున కొరత ఏర్పడటమే కాకుండా డిమాండ్ సైతం పెరిగిపోయింది. దాంతో రైతులు గత్యంతరం లేకపోవడంతో పొరుగు జిల్లాల నుంచి వరిగడ్డిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక గొర్రెలు, మేకలకు కూడా కూడా దాదాపు అదే పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. పంటలు విస్తృతంగా సాగుచేస్తే మూగజీవాల పశుగ్రాసానికి ఢోకా ఉండదు. పంటల సాగు అంతంత మాత్రమే ఉండటం, భగభగ మండే ప్రస్తుత వేసవిలో భూమిపై పచ్చగడ్డి కాసింతైనా లేకపోవడంతో వరిగడ్డి కొరత అనివార్యమైంది. పశుగ్రాసం కొరత ఏర్పడకుండా జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నివారణ చర్యలు చేపట్టినా పెద్దగా ఫలితం లేకుండా పొయింది. గడ్డి విత్తనాలు విరివిగా చల్లుకోవాలని రైతులకు సూచిస్తున్నా వారి నుంచి ఆశించిన స్థాయిలో స్పందన ఉండటం లేదని అధికారులు పేర్కొంటున్నారు. సాగునీటి లభ్యత లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని రైతులు అంటున్నారు. 2018-19 సంవత్సరంలో మండలంలో 384 టన్నుల గడ్డి విత్తనాలను 75 శాతం సబ్సిడీపై రైతులకు అందజేశారు. ఒక్కో ఎకరం విస్తీర్ణంలో గ్రాసం పండించాలంటే 20కిలోల విత్తనాలు అవసరమవుతాయి. రైతుల అవసరాలకు అనుగుణంగా గడ్డి విత్తనాలు సరఫరా చేయకపోవడంతో కొంతమేరకు పశుగ్రాసం కొరత ఏర్పడింది.
వేధిస్తున్న నీటి సమస్య
పశుగ్రాసమే కాదు.. తాగునీటి సమస్య కూడా మూగజీవాలను తీవ్రంగా వేధిస్తున్నట్లు చెప్పవచ్చు. 40 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలతో మూగజీవాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. తాగేందుకు గుక్కెడు నీళ్లు లభించక అలమటిస్తున్నాయి. వ్యవసాయ బోర్లలో నీటి నిల్వలు అడుగంటి పోవడంతో ఈ పరిస్థితి నెలకొందని అన్నదాతలు పేర్కొంటున్నారు. పశువులకు రోజుకు సగటున 40 లీటర్లు, గొర్రెలు, మేకలకు రెండు నుంచి మూడు లీటర్ల నీరు అవసరం. అవి లభించని పరిస్థితి ఎదురుకావడంతో రైతులు, గొర్రె కాపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామ పంచాయతీల్లో మూగ జీవాల దప్పిక తీర్చేందుకు ఏర్పాటు చేసిన నీటితొట్లు అలంకార ప్రాయంగా మారాయని చెప్పవచ్చు. 90శాతం పంచాయతీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నీళ్లు నింపాల్సిన బాధ్యతను సర్పంచ్‌లు తీసుకుంటే పశువులకు ఎంతో మేలు జరుగుతుంది. ఉపాధి హామీ పథకం కింద నిర్మించుకునే అవకాశం ఉన్నా పంచాయతీలు పట్టించుకోవడం లేదు. నీటి తొట్లను నిర్మించి నీరు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
పశుగ్రాసం కొరత
నివారణకు చర్యలు
పశుగ్రాసం కొరత నివారించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కేవీఎల్ నర్సింహారావు అన్నారు. 75 శాతం సబ్సిడీపై రైతులకు గడ్డి విత్తనాలు అందజేశామని, జిల్లాలో ఈ ఏడాది దాదాపు 390 టన్నుల వరకు రైతులకు విత్తనాలు అందించామని తెలిపారు. పశువులు, గొర్రెలు, మేకలు ఉన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చాలా గ్రామాల్లో ఏర్పాటు చేసిన నీటితొట్లలో నీళ్లు నింపాలని, గ్రామ సర్పంచ్‌లు వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.