రంగారెడ్డి

ప్రజలకు మెరుగైన సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఏప్రిల్ 21: నిజాంపేట్ మున్సిపల్ ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తామని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్ గ్రామాలను కలుపుతూ నూతనంగా నిజాంపేట్ మున్సిపాలిటీ ఏర్పడింది. నూతన మున్సిపల్ కమీషనర్‌గా ఇసాక్ బాధ్యతలను స్వీకరించారు. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీని ఐఏఎస్ అధికారి శ్రీదేవి పరిశీలించారు. మున్సిపల్ విధులు, బాధ్యతలు, మున్సిపల్ చట్టంను వివరించారు. శ్రీదేవి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 68 కొత్త మున్సిపాలిటీలు అవతరించాయని అందులో భాగంగానే నిజాంపేట్ మున్సిపాలిటీ అని తెలిపారు. గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించే వాటికి ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. మున్సిపల్‌లో జవాబుదారీ తనంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. భవన నిర్మాణ అనుమతులు, నీటి కనెక్షన్‌లను సైతం ఆన్‌లైన్‌లో అనుమతులు పొందే సౌకర్యం ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు హెచ్‌ఎండీఏలో నాలుగైదు వేల అనుమతులు, జీహెచ్‌ఎంసీలో 48070 మున్సిపాలిటీలలో 90 వేల అనుమతులను ఆన్‌లైన్ ద్వారా ఇచ్చామని తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి 21 రోజుల్లో అనుమతులను జారీ చేస్తామని స్పష్టం చేశారు. మీసేవా, మొబైల్ యాప్ వంటి సదుపాయాలతో ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలను అందిస్తామని పేర్కొన్నారు. శానిటేషన్ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయకుండా ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రత్యేకమైన విధానంతో శానిటేషన్‌ను తీసుకువస్తామని తెలిపారు. తెలంగాణకు హరితహారంలో మొక్కలు నాటడం, రోడ్లపై కాలుష్య నివారణకు డివైడర్ మధ్యలో, రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటి పెంచడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. మున్సిపల్ చట్ట ప్రకారం ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు ఖర్చులను తగ్గించుకోవడం, ఆదాయ వనరులను పెంచుకోవడం వంటి కార్యక్రమాలను చేపడతామని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.