రంగారెడ్డి

కేఎల్‌ఆర్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఏప్రిల్ 23: మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్ జన్మదిన వేడుకలను మంగళవారం కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. మేడ్చల్‌లోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు కేఎల్‌ఆర్ జన్మదిన వేడుకలను హజరయ్యారు. కేక్ కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. పలువురు కేఎల్‌ఆర్‌కు శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలను అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలోని రాయిలాపూర్ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ బాల్‌రెడ్డి, రఘుపతి రెడ్డి, సత్తిరెడ్డి, వెంకటరమణా రెడ్డిలతో పాటు సుమారు 200 మంది కార్యకర్తలు కేఎల్‌ఆర్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. చేరిన వారికి కేఎల్‌ఆర్ కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వనించారు. కార్యక్రమంలో హరివర్ధన్ రెడ్డి, వరదారెడ్డి, బాల్‌రెడ్డి, వేముల శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ, రాజు, ప్రకాశ్‌రెడ్డి, నిషిత పాల్గొన్నారు.
టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఎస్‌లో చిన్నారుల హల్‌చల్
మేడ్చల్, ఏప్రిల్ 23: మేడ్చల్ మున్సిపల్ కిష్టాపూర్ పరిధిలో గల తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వేసవి సెలవుల్లో చిన్నారులకు ‘హల్‌చల్’ పేరుతో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఏ. శైలజ తెలిపారు. టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఎస్ రాష్ట్ర కమిటీ మంగళవారం గురుకుల పాఠశాలను పరిశీలించారు. ప్రిన్సిపాల్ శైలజ మాట్లాడుతూ రాష్ట్రంలోని గురుకులాల్లో ఇది ప్రథమంగా నిర్వహిస్తున్న కార్యక్రమమని అన్నారు. కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపాల్ పద్మావతి, ఉపాధ్యాయులు నాగలక్ష్మీ, పుష్ప పాల్గొన్నారు.