రంగారెడ్డి

గొప్ప రాజకీయ నాయకులుగా యువత ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శామీర్‌పేట, ఏప్రిల్ 24: యువత గొప్ప రాజకీయ నాయకులుగా ఎదిగి..ప్రజలకు ఉత్తమ సేవలందించాలని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పొలిటీకల్ లీడర్ షిప్ (ఐఐపిఎల్) సంస్థ అధ్యక్షుడు సతీష్ చందర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వ సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల జగద్గిరిగుట్ట శాఖ ప్రిన్సిపాల్ ఉషాకిరణ్ ఆధ్వర్యంలో శామీర్‌పేటలో ‘సమ్మర్ సమురయ్’ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా 9,10వ తరగతి విద్యార్థులకు ‘యంగ్ పొలిటీషీయన్స్’ అనే అంశంపై సతీష్ చందర్‌తో పాటు ఇతర వక్తలు ఉపన్యాసాలు ఇచ్చి అవగాహన కల్పించారు. ఈ శిక్షణలో భాగంగా బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐఐపిఎల్ చైర్మన్ సతీష్ చందర్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు. జర్నలిజం అధ్యాపకులు శ్రీనాథ్, షేక్ షబ్మీర్, సల్మా, వైస్ ప్రిన్సిపాల్ ఉపేంద్రం, పాఠశాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలి
జీడిమెట్ల, ఏప్రిల్ 24: మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ ఓ ప్రకటనలో కోరారు. మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల నిర్వహణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వైఫల్యం ఫలితంగా 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న ఉదయం 10 గంటలకు కీసరలోని జిల్లా కలెక్టరేట్ ఎదురుగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.

‘జాతీయ పంచాయతీరాజ్’ దినోత్సవం
మేడ్చల్, ఏప్రిల్ 24: మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ‘జాతీయ పంచాయతీరాజ్’ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ పద్మావతి ఆధ్వర్యంలో కేక్‌ను కట్ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని సంబరంగా జరుపుకున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ విశిష్టతను ఎంపీడీఓ ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు, బిల్‌కలెక్టర్‌లు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే గెలుపునకు పునాది: శ్రీనివాస్ రెడ్డి
శామీర్‌పేట, ఏప్రిల్ 24: ప్రజా సంక్షేమ పాలన అందించిన టీఆర్‌ఎస్ పార్టీకి ఆకర్షితులై ప్రజలు తనను గెలుపిస్తారని మూడు చింతలపల్లి జడ్పీటీసీ టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎం.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేసిన తరువాత విలేఖరులతో మాట్లాడుతూ బంగారు తెలంగాణ ధ్యేయంగా కేసీఆర్ పని చేస్తున్నారని అన్నారు. మంత్రి మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో శామీర్‌పేట, మూడు చింతలపల్లి మండలాలు ఎంతో అభివృద్ధి చెందాయని రానున్న కాలంలో తనకు అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, నాయకులు యాదగిరి, జహంగీర్ పాల్గొన్నారు.