రంగారెడ్డి

ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఏప్రిల్ 24: కీసర జడ్పీటీసీ, ఎంపీటీసీల నామినేషన్ పర్వం ముగిసింది. చివరిరోజు జడ్పీటీసీ స్థానానికి ఏడు, ఎనిమిది ఎంపీటీసీ స్ధానాలకు 58 నామినేషన్లు దాఖలయ్యాయని ఎంపీడీవో శశికళ పేర్కొన్నారు. జడ్పీటీసీ స్ధానానికి టీఆర్‌ఎస్ నుంచి బెస్త వెంకటేశ్ రెండు నామినేషన్లు దాఖలు చేసారు. కాంగ్రెస్ నుంచి కోళ కృష్ణ రెండు నామినేషన్లు, బీజేపీ నుంచి గుండబోయిన ఐలయ్య, ఇండిపెండెంట్ అభ్యర్ధులుగా నాయకపు వెంకటేశ్ రెండు నామినేషన్లను దాఖలు చేసారు.
ఇక ప్రచారమే
ఉప్పల్: ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల పర్వం బుధవారం నాటితో ముగియడంతో ప్రచారానికి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పోటీకి సై అంటుండగా బీజేపీ, టీడీపీ నై అంటూ ఎన్నికల జోళికి వెళ్లడంలేదు. నగర శివారు కాచవానిసింగారం మహిళా జనరల్‌లో ఎంపీటీసీ-1 నుంచి టీఆర్‌ఎస్ నుంచి వర్కల లక్ష్మమ్మ నామినేషన్ దాఖలు చేయగా ఇదే పార్టీ నుంచి రెబల్‌గా మాజీ సర్పంచ్ మునికుంట్ల స్వర్ణలత సైతం నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. కాంగ్రెస్ నుంచి మాజీ సర్పంచ్ మునికుంట్ల ముత్యాలు గౌడ్ భార్య సత్యవతి, రాజేష్ తల్లి జంగమ్మ నామినేషన్ దాఖలు చేశారు. వీరిలో ఎవరు రంగంలో ఉంటారో లేక ఉండరో తెలియదు కానీ ప్రాదేశిక ఎన్నికల సందడి నెలకొంది. గత సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి కొంతం వెంకట్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. అధికార టీఆర్‌ఎస్ నుంచి టిక్కెట్ తెచ్చుకున్న వర్కల లక్ష్మమ్మకు అదే పార్టీ నుంచి రెబల్ అభ్యర్థి స్వర్ణలత భయం నెలకొంది. ఈమెను ఉపసంహరించుకోవాలని అధిష్ఠానం నుంచి ఒత్తిడి వస్తున్నప్పటికీ పంచాయతీ సభ్యులు ఆరుగురు తనకే మద్దతు ప్రకటిస్తున్నారని, రెబల్‌గా ఘన విజయం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జడ్పీ చైర్మన్ అభ్యర్థిని గెలిపించాలి
ఘట్‌కేసర్: మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్ధి మలిపెద్ది శరత్‌చంద్రా రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ సైనికునిలా పనిచేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. స్థానిక సంస్థల నామినేషన్ల చివరిరోజు కావటంతో బుధవారం టీఆర్‌ఎస్ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్ధులు నామినేషన్లు వేసేందుకు ర్యాలీ నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలతో మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్ కార్యాలయం నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో మంత్రి మల్లారెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపురి రాజు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లాలోని అయిదు జడ్పీటీసీ స్థానాలు, 42 ఎంపీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని చెప్పారు. ఘట్‌కేసర్ జడ్పీటీసీ అభ్యర్ధి శరత్‌చంద్రా రెడ్డి జడ్పీ చైర్మన్‌గా పదవి బాధ్యతలు చేపట్టనున్నారని, మండలంలోని టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు కష్టపడి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఎంపీటీసీ అభ్యర్ధులు ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి పార్టీ ప్రతిష్టను పెంచాలని సూచించారు. సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభంజనం వీస్తుందని, ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్ధులను భారి మెజారిటీతో గెలిపించాలని కోరారు. జడ్పీటీసీ అభ్యర్ధిగా మలిపెద్ది శరత్‌చంద్రా రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థులుగా అంకుషాపూర్ (జనరల్ మహిళ) మేడబోయిన స్రవంతి, అవుషాపూర్ (జనరల్) ఏనుగు సుదర్శన్ రెడ్డి, కొర్రెముల (ఎస్సీ మహిళ) బీ.వినోద, చౌదరిగూడ-1 (బీసీ జనరల్) ఉదారి వేణుగోపాల్, చౌదరిగూడ-2 (జనరల్) పాలడుగు సందీప్‌రెడ్డి, ఏదులాబాద్-1 (బీసీ మహిళ) కందుల సరళ, ఏదులాబాద్-2 (ఎస్సీ) కూరం రవి, కాచివాని సింగారం-1 (జనరల్ మహిళ) వర్కల లక్ష్మమ్మ, కాచివానిసింగారం-2(జనరల్) మలిపెద్ది వెంకట్రామ్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బోయపల్లి కొండల్‌రెడ్డి, మండల సహకార సంఘం మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, బీ.హరిప్రసాద్ రావు, తరిణే మహింధ్రాచారి, అంజిరెడ్డి, కృష్ణమూర్తి, రమేశ్ పాల్గొన్నారు.
అన్ని స్థానాలు కైవసం చేసుకుంటాం
జిల్లా పరిషత్ చైర్మన్‌తో పాటు అన్ని మండల పరిషత్ చైర్మన్ల పదవులు కైవసం చేసుకుంటామని మేడ్చల్ నియోజకవర్గం ఎన్నికల ఇన్‌చార్జి వేముల మహేష్ గౌడ్ తెలిపారు. మండల పరిధి మర్పల్లిగూడ గ్రామంలోని దుర్గమ్మ ఆలయం ఆవరణలో మండల ముఖ్య నాయకుల సమావేశం బుధవారం జరిగింది. మండల జడ్పీటీసీతో పాటు తొమ్మిది ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. జడ్పీటీసీగా పాలడుగు అమరేందర్ రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్ధులుగా అవుషాపూర్ ఓ.సంజయ్, అంకుషాపూర్ పోచమ్మ, ఏదులాబాద్-1 పద్మ బాలవేంకటేశ్, ఏదులాబాద్-2 గట్టగల్ల రవి, కొర్రెముల పీ.నర్సింగ్ ముదిరాజ్, చౌదరిగూడ-2 పీ.్భస్కర్ రెడ్డి, కాచివానిసింగారం-1 కర్రె జంగమ్మ, కాచివానిసింగారం-2 కర్రె రాజేష్.. అభ్యర్థులుగా రంగంలో ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో టీపీసీసీ లీగల్‌సెల్ నాయకుడు పాలడుగు అమరేందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు రాజేష్, సత్తయ్య గౌడ్, రాజేందర్ గౌడ్ పాల్గొన్నారు.
మేడ్చల్ జడ్పీ పీఠం కాంగ్రెస్‌దే
శామీర్‌పేట: ప్రస్తుతం జరగనున్న జడ్పీటీసి, ఎంపీటీసి ఎన్నికల్లో బరిలో కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో గెలుపొంది మేడ్చల్ జడ్పీ చైర్మన్ పదవిని కైవసం చేసుకుంటుందని పార్టీ మండల శాఖ అధ్యక్షుడు జీ.మహేందర్ రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ శామీర్‌పేట, మూడు చింతల పల్లి మండలాల్లో తమ పార్టీకి చెందిన అభ్యర్థులందరు బరిలో ఉన్నారని వీరందరు ఇతర పార్టీలకు గట్టీ పోటీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఎంపీ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి భారీ మెజారీటితో గెలుపొంది పార్లమెంట్‌లో ప్రశ్నించే గొంతుక ఉంటారని చెప్పారు. స్థానిక మంత్రి మల్లారెడ్డి శామీర్‌పేటలో, రాష్ట్రంలో కేసీఆర్ ఇరువురు కుటుంబ పాలన చేస్తున్నారని విమర్శించారు. మూడుచింతలపల్లి మండలానికి స్థానికేతరుని తీసుకొచ్చి జడ్పీటీసిగా పోటీ చేయస్తున్నారని స్థానికులను కాకుండా కేవలం మంత్రి బంధువుగా ఉన్న అభ్యర్థిని ఎన్నికల బరిలో ఉంచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్‌నే నమ్ముకొని అనేక కష్టనష్టాల కోర్చి పార్టీకి సేవలందించామని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఇతర పార్టీకి జంప్ జలానీల కాకుండా పార్టీ సేవలందించామని ఈ విషయంపై పార్టీ అధిష్ఠానం సరైన నిర్ణయం తీసుకోవాలని మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
పోటాపోటీగా నామినేషన్‌లు
మేడ్చల్: జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్‌లు దాఖలు కోసం చివరి రోజైన బుధవారం ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్‌లు దాఖలు చేశారు. నామినేషన్‌ల ప్రక్రియకు చివరి రోజు కావడంతో మండల పరిషత్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున కోలాహలం నెలకొంది. మేడ్చల్ మండలంలో మొత్తం పది ఎంపీటీసీ స్థానాలు ఒక జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. టీఆర్‌ఎస్ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులతో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు కూడా రంగంలోకి దిగి నామినేషన్‌లను దాఖలు చేశారు. నామినేషన్‌ల సందర్భంగా పలువురు అభ్యర్థులు తమ గ్రామాల్లోని ఆలయాల్లో ఇష్టదైవాలకు ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి తరలివచ్చారు. మేడ్చల్ మండల జడ్పీటీసీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ తరఫున శ్రీరంగవరం సర్పంచ్ విజయానంద్ రెడ్డి సతీమణి శైలజ నామినేషన్ దాఖలు చేయగా, తిరుగుబాటు అభ్యర్థిగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్ సతీమణి అనిత కూడా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా గౌడవెల్లి గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మీ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ నుంచి బచ్చు కృష్ణప్రియా మల్లారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. గౌడవెల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ నుంచి పద్మజా జగన్‌రెడ్డి తన మద్దతుదారులతో ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. డబిల్‌పూర్ ఎంపీటీసీ అభ్యర్థిగా రజిత రాజమల్లారెడ్డి తన మద్దతుదారులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. మండలంలో మ్తొతం పది ఎంపీటీసీ స్థానాలకు 84 నామినేషన్‌లు దాఖలు కాగా జడ్పీటీసీ స్థానానికి నాలుగు నామినేషన్‌లు దాఖలైనట్లు సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పద్మావతి తెలిపారు. నామినేషన్ కేంద్రం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. నామినేషన్‌లు దాఖలు చేసే అభ్యర్థులు తమ అనుచరులతో తరలిరావడంతో కార్యాలయం వద్ద సందడి నెలకొంది. మండల పరిషత్ కార్యాలయ ఆవరణ మొత్తం పదుల సంఖ్యలో కార్లతో నిండిపోయింది. మొత్తం మీద మొదటి విడత పరిషత్ ఎన్నికల నామినేషన్‌ల కార్యక్రమం ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపీరి పీల్చుకున్నారు.
మంత్రి బంధువులకే బీ-ఫాంలు
జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో ఉద్యమకారులు పార్టీ అభివృద్ధికి అహర్నిశలు పనిచేసిన వారికి కాకుండా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి బంధువులకే బిఫాంలు ఇవ్వడంతోనే తిరుగుబాటు అభ్యర్థులుగా మేడ్చల్ పరిషత్ ఎన్నికల బరిలోకి దిగాల్సివచ్చిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, మండలంలోని పది ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు రెబల్ అభ్యర్థులను బరిలో దించామని వారిని గెలిపించుకుని మంత్రి మల్లారెడ్డికి తగిన గుణపాఠం చెప్తామని సవాల్ విసిరారు. మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా తాను సూచించిన ఏ ఒక్కరికి కూడా బీ-ఫాం ఇవ్వలేదని వాపోయారు. అంతా మంత్రి మల్లారెడ్డి బామ్మర్ది, ఎంపీ అభ్యర్థి ఇష్టానుసారంగా అభ్యర్థులను ఎంపిక చేశారని ఆరోపించారు. మంత్రి ఒంటెద్దు పోకడలతో మేడ్చల్ మండలంలో టీఆర్‌ఎస్‌కు భారీ నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం పాటుపడిన వారిని గుర్తించకుండా నిన్న మొన్న చేరిన వారికి బీఫాం ఎలా ఇస్తారని దుయ్యబట్టారు. అన్ని పదవులు మంత్రి కుటుంబ సభ్యులు, బంధువులకేనా అని భాస్కర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణుల ఒత్తిడి మేరకే తన సతీమణి అనితను జడ్పీటీసీ రెబల్‌గా బరిలో దింపానని అన్నారు. మేడ్చల్ మండల ప్రజలపై తనకు నమ్మకం ఉందని భారీ మోజారిటీతో గెలిచి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు.