రంగారెడ్డి

భక్తిశ్రద్ధలతో శ్రీవారి కల్యాణోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ టౌన్, మే 16: భక్తిశ్రద్ధలతో శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గురువారం కేశంపేట మండల పరిధిలోని నిర్ధవెల్లి శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి కల్యాణోత్సవం కన్నుల పండువగా వైభవంగా నిర్వహించారు. నిర్ధవెల్లి గ్రామానికి చెందిన భక్తులు స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. శ్రీవారి కల్యాణోత్సవాన్ని చూసేందుకు నిర్ధవెల్లి గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్ధం దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వ్యవస్థాపక దర్శకర్తలు కేశరాం గోదావరి, కేశవరాం వెంకట్ రావు, ఉత్సవ కర్తలు హన్మంత్ రావు, పురుషోత్తం రావు, రామ్మోహన్ రావు, మురళీమోహన్ రావు, స్థానిక సర్పంచ్ బడ్క పార్వతి, ఉప సర్పంచ్ మల్లయ్య, బడ్క వెంకటయ్య, ఉమాపతి, గ్రామస్థులు నరేష్, ప్రకాష్, శ్రీనివాస్ రావు, శ్యాంసుందర్ చారి పాల్గొన్నారు.
దత్తాత్రేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన
కొందుర్గు: జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రంలో శ్రీసద్గురు దత్తాత్రేయ స్వామి నూతన విగ్రహం ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఈనెల 18న నిర్వహించనున్నట్లు పూజారి మఠం రాజశేఖర స్వామి తెలిపారు. ఈనెల 17న మహా గణపతి పూజ, మంగళ శ్లోకాలు, నవగ్రహారాధన, అంకురారోహణ, 18న దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన, మంగళ హారతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

హయత్‌నగర్, మే 16: ప్రజలందరూ ప్రభుత్వంపై ఆధారపడకుండ సాంఘిక బాధ్యతగా వ్యవహరిస్తూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్బీనగర్ జర్నలిస్టులు, జీహెచ్‌ఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం లింగోజిగూడ డివిజన్ సాయిరాంనగర్ కాలనీలో సాఫ్ హైదరాబాద్ - షాందార్ హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస రావు, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ విజయకృష్ణ హాజరయ్యారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దాలని తెలిపారు. 2001లోనే ఇంటి ముందు తప్పక ఇంకుడుగుంతను నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కౌన్సిల్‌లో ప్రతిపాదించినట్లు గుర్తుచేశారు. నియోజకవర్గంలో సుమారు 1500 ఫీట్ల వరకు బోరువేసిన చుక్క నీరు కూడా రావడం లేదని భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోయాయని తెలిపారు. ఈనెల 18న అన్ని కాలనీలలో ఇంకుడుగుంతల పున నిర్మాణ పనులు చేపట్టినట్లు గుర్తుచేశారు. కార్యక్రమంలో పాత్రికేయులు ప్రవీణ్ కుమార్, మేకల సత్యనారాయణ, తాండవ కృష్ణ, దశరథ, శేఖర్, బికుమండ్ల శ్రీనివాస్, దామర్ల చంద్రశేఖర్, మేకల రవీందర్ రెడ్డి, మోతె లింగస్వామి, అశోక్ గౌడ్, సాగర్, నర్సింగ్, అనీల్, యజ్ఞ, సుభాష్, నాయకులు నర్సింహ గుప్త, శ్రావణ్ కుమార్ గుప్త, ఇంద్రజీ, నర్రె శ్రీనివాస్ పాల్గొన్నారు.