రంగారెడ్డి

అభివృద్ధి పట్టింపులేని ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాబాద్, మే 19: గ్రామ పంచాయతీలో కార్యదర్శులుతో ఇంటి రుసుములు వసూలు చేయడం తప్ప, చేసింది ఏమి లేదని గ్రామాల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపటడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లు ఉంటే అభివృద్ధి సాధ్యం అవుతుందని ఎన్నికలు నిర్వహించి నెలలు గడస్తున్నా చెక్కు పవర్ లేదు. ఎలాంటి వౌలిక వసతులు కల్పించక పోవడంతో గ్రామా అభివృవృద్ధి మరింత కుంటుపడింది. గ్రామాల్లో కనీసం వీధిదీపాలు, మంచి సౌకర్యం కల్పించడం లేదు. మురికికాలువల పరిశుభ్రత పాటించకపోవడంతో గ్రామాలు కంపుకొడుతున్నాయి. గ్రామంలో ఉపాధి హామీ ద్వారా పాడిపశువులకు తాగునీటికి కులాయి ఏర్పాటు చేసినా నీటి సౌకర్యం లేకపోవడంతో ఎండిపోయి నెర్రలు పగిలి పాడైపోతున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేస్తే ఎన్నికల కోడ్ ఉందని, ఎలాంటి పనులు అడగవద్దని పొంతనలేని సమాధానం ఇస్తున్నారని గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు. మిషన్ భగీరథ కోసం ఇష్టానుసారంగా తవ్వి పూడ్చకుండానే వదిలేశారు.

ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం
కొత్తూరు రూరల్, మే 19: ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని రోడ్డులను శుభ్రం చేశారు. ఆదివారం నందిగామ మండల పరిధిలోని అప్పారెడ్డిగూడ గ్రామంలో పంచాయతీ సెక్రటరీ టీ.అనిత ఆధ్వర్యంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి చీపురులతో గ్రామంలోని రోడ్లను శుభ్రం చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సీతారాములు, వార్డు సభ్యులు ప్రశాంతి, కమలమ్మ, మంజుల, ప్రతాప్, నర్సింలు, కృష్ణ, ప్రభు, వెంకట్, రవి, బీ.రవి, శ్రీను, సురేష్ పాల్గొన్నారు.