రంగారెడ్డి

ప్రాదేశిక ఫలితాలపై ఎవరి ధీమా వారిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, మే 19: ప్రాదేశిక ఎన్నికల తుది విడత పోరు ముగియడంతో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఆయా పార్టీల నేతలు అంతర్మథనంలో పడ్డారు. ఓటర్లు తమను గెలిపిస్తారో లేదోనన్న సందేహంతో సతమతమవుతున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు పేరుకే పరిమితమని తెలిసినా, పరువు నిలుపుకోవడానికి పెద్దమొత్తంలో ఖర్చు చేసిన నాయకులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నం, మంచాల, అబ్దుల్లాపూర్ మెట్ మండలాలు మొదటి విడతలో పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోగా, యాచారం మండలంలో మూడవ విడతలో పోలింగ్ జరిగింది. నాలుగు మండలాల్లో కేవలం ఒక్క చోటు అది యాచారం మండల పరిధిలోని మల్కీజ్‌గూడలో మాత్రమే నాటకీయ పరిణామాల మద్య ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. యాచారంలోని మిగిలిన 13 స్థానాలు, ఇబ్రహీంపట్నంలోని 11, మంచాలలోని 15, అబ్దుల్లాపూర్‌మెట్‌లోని 13 ఎంపీటీసీ స్థానాల్లో గెలుపుపై అభ్యర్థులు ఎవరి ధీమాలో వారున్నారు.
నాలుగు మండలాల్లోనూ ప్రధానంగా పోటీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే ఉంది. అక్కడక్కడా స్వతంత్రులు కూడా ప్రధాన పార్టీలకు పోటీ నిచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసి గెలుపుపై అంచనాలతో ఉన్నారు. టీఆర్‌ఎస్ తరుపున అభ్యర్థులకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అతని తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, నాయకులు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకట రమణా రెడ్డి ప్రచారాన్ని నిర్వహించగా, కాంగ్రెస్ తరుపున మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మాజీ మంత్రి, భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ద్వితీయశ్రేణి నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. టీఆర్‌ఎస్ అభివృద్ధి మంత్రాన్ని అస్త్రంగా చేసుకొని ప్రజల్లోకి వెళ్లింది. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ప్రశ్నించే వారిని గెలిపించాలని ఓటర్లను కాంగ్రెస్ అభ్యర్థించింది.
భారీగా పెరిగిన ఎన్నికల ఖర్చు
నాలుగు మండలాల్లో ప్రాదేశిక ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీలో నిలిచిన అభ్యర్థులకు ఖర్చు భారీగా పెరిగింది. ఇబ్రహీంపట్నం, యాచారం జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఎస్సీ జనరల్‌కు, మంచాల జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యాయి. ఇబ్రహీంపట్నం, యాచారం మండలాల్లో ఎన్నికలు సాదారణంగా ఉంటుందని భావించినా, ఊహించని రీతిలో అభ్యర్థులు భారీగా ఖర్చు చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో రూ.40లక్షల నుంచి కోటి రూపాయలకుపైగా ఖర్చు చేయగా నామమాత్ర పదవులైన ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవుల కోసం అదే రీతిన అరకోటికి పైగానా వెచ్చించారనే ప్రచారం జరుగుతోంది. ఒక్కో అభ్యర్థి తమకు తోచిన విధంగా డబ్బును పంచారన్నది పల్లెల్లో జరిగిన వాస్తవం. కొంత మంది బియ్యం బస్తాలను పంచడం, మరికొంత మంది ఓటుకు రూ. వెయ్యి నుంచి రూ.3వేల వరకు తగ్గకుండా ఓటర్లకు ముట్టజెప్పారు. ఇబ్రహీంపట్నం, యాచారం మండలాల్లో అభ్యర్థుల ఖర్చు కొంతమేరా తక్కువగానే ఉన్నా మంచాల, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లో అభ్యర్థులు డబ్బులను భారీగా గుమ్మరించారు. నియోజవకర్గం మొత్తంగా అభ్యర్థులు 80 శాతం మంది ఓటర్లకు ఒక్కొక్కరికి ముట్టజెప్పారు.
బ్యాలెట్ పెట్టెల్లో భవిష్యత్తు
అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ పెట్టెల్లో భద్రంగా ఉంది. సార్వత్రిక ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు ఈవీఎం యంత్రాల ద్వారా నిర్వహించగా, పరిషత్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిన నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నెల 23వ తేదీన పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉండడంతో 27న ప్రాదేశిక ఎన్నికల లెక్కింపు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నుండి పోటీ చేసిన అభ్యర్థులు తాము అధిక స్థానాలను కైవసం చేసుకుంటామంటే తాము అధిక స్థానాలను కైవసం చేసుకుంటామని ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. గతంలో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండడంతో నాలుగు మండలాల్లోనూ ప్రభావాన్నిచూపింది. టీఆర్‌ఎస్ అంతగా ఉనికిని చాటుకోకపోవడంతో ప్రధాన పోటీ కాంగ్రెస్, టీడీపీ మధ్యే కొనసాగింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నామమాత్రంగా మారి టీఆర్‌ఎస్ బలపడింది. తెలుగుదేశం పార్టీ కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతివ్వడంతో అక్కడ గెలుపుపై అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.