రంగారెడ్డి

రామయ్యగూడెం గడగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, మే 19: భానుడి ప్రతాపానికి ఉక్కిరిబిక్కిరి అవుతుండగా మరో వైపు విష జ్వరాలు సైతం ప్రజలను వణికిస్తున్నాయి. వికారాబాద్ పట్టణం రామయ్యగూడ కాలనీలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ వ్యాధిన పడి ఓ బాలిక ఆదివారం మృతి చెందింది. వివరాల్లోకి వెళ్లితే.. రామయ్యగూడకు చెందిన నిర్మల, రాజు కూతురైన ఆరాధ్య(8) వారం రోజుల క్రితం డెంగ్యూ వ్యాధి సోకింది. తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించిన ఫలితం లేకపోయింది. దీంతో ప్రైవేటు ఆసుపత్రి వైద్యుల సలహా మేరకు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించగా, డెంగ్యూ వ్యాధి సోకిందని నగరంలోని వైద్యులు తెలిపారు. ఆరాధ్య చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. దీంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఇలా కాలనీలోని పలువురు చిన్నారులను విష జ్వరాలు పట్టి పీడిస్తున్నాయని, వైద్యశాఖ అధికారులు పట్టించుకుని విష జ్వరాల భారిన పడిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు నిర్వహించాలని కాలనీవాసులు కోరుతున్నారు. రామయ్యగూడకు చేరువలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిరుపయోగంగా ఉందని, వెంటనే వైద్య సేవలందించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అక్రమ లేఔట్ కూల్చివేత
మేడ్చల్, మే 19: ఎటువంటి అనుమతులు లేకుండా అనధికారికంగా వెలిసిన అక్రమ లేఔట్‌పై అధికారులు కొరడా ఝళిపించారు. మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి పరిధిలోని అక్రమ లేఔట్‌ను అధికారులు ఆదివారం కూల్చివేశారు. జీపీపల్లి పరిధిలోని సర్వే 40/3లో అక్రమ లేఔట్‌ను జేసీబీ సహాయంతో కూల్చివేశారు. వెంచర్‌లో నిర్మించిన గదితో పాటు ప్లాట్లను సూచించే హద్దు రాళ్లను తొలగించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో అక్రమ లేఔట్లపై అధికారులు కొరడా ఝళిపిస్తున్న విషయం తెలిసిందే. గుండ్లపోచంపల్లిలో వెలిసిన అక్రమ వెంచర్‌పై అధికారులు ముందుగానే చర్యలు చేపడుతున్నారు. గతంలో పలు లేఔట్లను కూల్చివేసిన అధికారులు తాజాగా ఆదివారం కూడా అనుమతులు లేని అనధికార లేఔట్‌ను కూల్చివేశారు. కార్యదర్శి చంద్రప్రకాశ్ ఆధ్వర్యంలో సిబ్బంది.. లేఔట్‌లోని రాళ్లను తొలగించడంతో పాటు రోడ్లను కూడా తొలగించారు. గుండ్లపోచంపల్లి పరిధిలో అక్రమ లేఔట్లు నిర్మిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కార్యదర్శి హెచ్చరించారు. లేఔట్ యాజమానులు కచ్చితంగా హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు పొందాలని సూచించారు. ప్లాట్ల కొనుగోలుదారులు కూడా జాగ్రత్తగా ఉండాలని అక్రమ వెంచర్‌లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని, హెచ్‌ఎండీఏ అనుమతులు ఉంటేనే కొనుగోలు చేయాలని కార్యదర్శి సూచించారు.

సమసమాజ స్థాపనకు కృషి చేసిన సుందరయ్య
*నివాళి అర్పించిన నేతలు
షాద్‌నగర్, మే 19: కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 35వ వర్ధంతిని నిర్వహించారు. ఆదివారం షాద్‌నగర్ పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, టీఎస్‌యూటీఎఫ్, జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో సీఐటీయూ జిల్లా నాయకులు ఎన్.రాజు అధ్యక్షతన పుచ్చలపల్లి సుందరయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఎన్.రాజు మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య సమ సమాజ స్థాపన కోసం తన ఆస్తిని, సర్వస్వాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. లక్ష్య సాధన కోసం నిర్విరామంగా పనిచేసి, తన జీవితం మొత్తాన్ని సమసమాజ స్థాపనకే అంకితం చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు, ఈశ్వర్ నాయక్, ప్రశాంత్, శ్రీకాంత్, రాజశేఖర్, సురేష్, శివారెడ్డి, నజీర్, నర్సింలు గౌడ్, వెంకటరమణ పాల్గొన్నారు.