రంగారెడ్డి

ప్రశ్నించే గొంతుకకే పట్టం కట్టిన ప్రజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్కాజిగిరి, మే 23: నరాలు తెగే ఉత్కంఠ, కౌంటింగ్‌లో ప్రతి రౌండుకు నువ్వా, నేనా అన్నట్టు సాగిన హోరాహోరీలో చివరకు మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి ఏ.రేవంత్ రెడ్డి దాదాపు పదివేల ఓట్ల పైచిలుకు మోజారీటితో ఘనవిజయం సాధించారు. దేశంలోనే అత్యంత భారీ సంఖ్యలో ఓటర్లున్న మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పార్టీ అభ్యర్ధిగా రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడి నుంచి పోటి చేశారు. అన్ని తానై ప్రచారం నిర్వహించి ప్రణాళిక బద్ధంగా పావులు కలిపారు. కాంగ్రెస్‌లో ఎన్నో గ్రూపులున్నా అందరిని ఏకం చేసి ఐక్యంగా తన విజయం కోసం పనిచేసే విధంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సహాన్ని నింపారు. గురువారం ఓట్ల లెక్కింపు సందర్భంగా మొదటి రౌండ్ నుంచి తీవ్ర ఉత్కంఠ రేపిన మల్కాజిగిరి ఎన్నిక చివరుకు రేవంత్ రెడ్డిని విజయం వరించింది. దీంతో మల్కాజిగిరి ప్రాంతంలో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబురాలు మిన్నంటాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు భారీ విజయాన్ని అందించిన ప్రజలు దాదాపు ఆరు నెలల్లోపు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను తిరస్కరించారు. ఇందుకు అనేక కారణాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపాయని విశే్లషకులు భావిస్తున్నారు. ప్రజలే కాకుండా మల్కాజిగిరి, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని అన్ని సెగ్మెంట్ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరుత్సాహనికి గురి చేశాయి. ఎల్‌బి స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు లేక పోవటంతో కేసీఆర్ సభను రద్దు చేసుకున్నారు. వీటన్నింటి ఫలితంగానే టీఆర్‌ఎస్‌ను ప్రజలు తిరస్కరించారనే విశే్లషకులు భావిస్తున్నారు.
కేపీహెచ్‌బీకాలనీ: మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి విజయం సాధించడంతో కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహాం నెలకొంది. గురువారం కూకట్‌పల్లి కాంగ్రెస్ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకుని సంబురాలు జరుపుకున్నారు. మాట్లాడుతూ మార్పు తీసుకరావాడానికే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేసి రేవంత్ రెడ్డిని గెలిపించారని అన్నారు. రేవంత్‌రెడ్డి గెలుపునకు కృషి చేసిన ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యమ్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘట్‌కేసర్: మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించటంతో మండల నాయకులు, కార్యకర్తలు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గురువారం బాణాసంచాలు కాల్చీ సంబురాలు జరుపుకున్నారు. మేడ్చల్ బీ-బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో వందలాది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్, రేవంత్‌రెడ్డికి మద్దతుగా నినాదాలు చేస్తు భారీ ర్యాలీ జరిపారు. అనంతరం మిఠాయిలు పంచుకున్నారు. మహేష్ గౌడ్ మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వ అరాచకాలను అరికట్టేందుకు ప్రశ్నించే గొంతుకను గెలిపించినట్లు తెలిపారు. డబ్బుతో ఏదైనా సాధించవచ్చనే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అహంకారానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పినట్లు తెలిపారు. పోచారం పురపాలక సంఘం కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు బాలగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నోజిగూడ గ్రామంలో ఘనంగా సంబురాలు జరుపుకున్నారు. రాష్ట్ర నాయకులు పాలడుగు అమరెందర్ రెడ్డి, సీనియర్ నాయకులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు నానావత్ రూప్‌సింగ్ నాయక్, కొమ్మిడి రాఘవ రెడ్డి, అనురాధరెడ్డి, మామిండ్ల ముత్యాలు యాదవ్, సగ్గు అనిత, బద్దం గోపాల్‌రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ నాయకుడు నానావత్ ధన్‌సింగ్‌నాయక్, నాయకులు భిక్షపతినాయక్, బాలగోని వినోద్‌గౌడ్ పాల్గొన్నారు.
వనస్థలిపురం: మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్‌రెడ్డి విజయం కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజల విజయం అని టీపీసీసీ కార్యదర్శి జక్కిడి ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీగా రేవంత్‌రెడ్డి విజయం అనంతరం ఎల్బీనగర్‌లో భారీర్యాలీ నిర్వహించారు.కార్యకర్తలకు మిఠాయిలు పంచుతూ ఎల్బీనగర్ చౌరస్తాలో బాంబులు కాల్చారు. ఎల్బీనగర్ చౌరస్తాలోని స్వర్గీయ రాజీవ్‌గాంధీ, లాల్ బహదూర్ శాస్ర్తి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఏర్పాటు చేసిన సమావేశంలో జేపీఆర్ మాట్లాడుతూ మల్కాజిగిరి పార్లమెంట్ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ప్రజల కోసం పార్లమెంట్‌లో ప్రశ్నించే గోంతును గెలిపించారని గుర్తు చేశారు. తెరాస అధినేత కేసీఆర్ పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత పార్లమెంట్ ఎన్నికలలో స్పష్టంగా కనిపించిందని, త్వరలో వెలువడనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని జక్కిడి ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు జైపాల్‌రెడ్డి, బుడ్డా సత్యనారాయణ, నర్సింహా పాల్గొన్నారు.
దిల్‌సుఖ్‌నగర్: మల్కాజీగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎనుమల రేవంత్ రెడ్డి గురువారం వెలువడిన ఎన్నికల పలితాలలో విజయం సాధిచడంతో ఎల్‌బినగర్ నియోజకవర్గం కాంగ్రేస్ శ్రేణులు నూతన ఉత్సాహంతో జరుపుకున్న సంబురాలు అంబరాన్నంటాయి. టపాకాయలు కాల్చి మిఠాయలు పంచుకుంటూ విజయోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంగారెడ్డి జిల్లా బీసీసీ జనరల్ సెక్రెటరి వక్కలంక శ్రీవివాస్ మాట్లాడుతూ కేసీఆర్ దుర్మార్గ పాలనను చూసి ప్రజలల్లో మార్పు వచ్చిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం ఎవరి సొంతం కాదని అన్నారు. ప్రశ్నించే గొంతుక రేవంత్ రెడ్డిని కొండంగల్ నియోజకవర్గంలో అనేక ఇబ్బందులకు గురి చేసి ప్రబుత్వం దొడ్డి దారిన అప్పుడు గెలిచిందని విమర్శించారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ ప్రజలందరికి విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్వరూప్ రాజు, పాల్గొన్నారు.