రంగారెడ్డి

బీజేపీలో కొత్త జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, మే 23: పార్లమెంట్ ఎన్నికలు భారతీయ జనతా పార్టీలో కొత్త జోష్ నింపిందని చెప్పవచ్చు. కేంద్రంలో ఎదురులేకుండా రెండోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థానాలను సాధించడంతో వివిధ రాష్ట్రాలలో తన మార్కు చూపడంతో బీజేపీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇదే పార్లమెంట్ స్థానానికి ప్రాతినిథ్యం వహించిన టీఆర్‌ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్‌కి చెందిన మాజీ మంత్రి డీకే అరుణ భారతీయ జనతా పార్టీలో చేరి మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. షాద్‌నగర్ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలోకి మారినా.. పార్లమెంటు మాత్రం మహబూబ్‌నగర్ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇలాంటి పరిస్థితులలో గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయిన శ్రేణులు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే సరికి మాత్రం తమ పట్టుదలను చూపాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు తక్కువగా సాధించి ఎదురు దెబ్బ తిన్న బీజేపీకి నేడు వెలువడిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఓటింగ్ శాతం పెంచుకోవడం స్థానిక బిజేపి శ్రేణుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈరోజు వెలువడిన పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంతో పాటు అనూహ్యంగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలను.. మెరుగైన ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది. హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న ఈనియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ప్రభావం ఉంటుంది. ఈ ఎన్నికల్లో షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి 40329ఓట్లను సాధించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లకు దీనికి పోలిస్తే చాలా వ్యత్యాసం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ.. షాద్‌నగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఓటింగ్ శాతం పెరిగింది.
సంబరాల్లో బీజేపీ నాయకులు
కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా ఎంపీ స్థానాలు రావడం, తెలంగాణలో బీజేపీ కొన్ని స్థానాల్లో విజయం సాధించడం పట్ల స్థానిక పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. గురువారం మధ్యాహ్నం షాద్‌నగర్ ముఖ్యకూడలిలో బీజేపీ శ్రేణులు టపాసులు పెల్చి సంబరాలు చేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వర్ధిల్లాలని అంటూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. ముఖ్యకూడలి నుండి పలు వీధుల మీదుగా పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు.
సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టారు
బాలాపూర్: కేంద్రంలో బీజేపీ రెండో సారి అధికారంలోకి రావడానికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి, సంక్షేమంతో పాటు అవినీతి రహిత పాలన దోహదపడ్డాయని మహేశ్వరం బీజేపీ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్ పేర్కొన్నారు. గురువారం వెలువడిన ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా బాలాపూర్ మండలంలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున బాణసంచాలు కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి, సంబురాలు చేసుకున్నారు. నాదర్‌గుల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన విజయోత్స సంబురాలకు అందెల శ్రీరాములు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చరిష్మా ముందు విపక్షాలు నిలబడలేకపోయాయని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధిక్యత సాధించి, అధికారంలోకి రావాడం ఖాయమని అందేల దీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఎనుగు రాంరెడ్డి, పెత్తుల పుల్లా రెడ్డి, టేకుల భాస్కర్ రెడ్డి, నిమ్మల నరేందర్ గౌడ్ పాల్గొన్నారు. బాలాపూర్ చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర నాయకుడు కోలన్ శంకర్ రెడ్డి అధ్వర్యంలో బీజేపీ శ్రేణులు బణసంచ కాల్చి పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పెండ్యాల నర్సింహ, గుర్రం మల్లా రెడ్డి పాల్గొన్నారు.
జీడిమెట్ల: కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి భారీ స్థాయిలో ఆధిక్యతను సాధించిన సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణులు సంబురాలను జరుపుకున్నారు. షాపూర్‌నగర్‌లో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ బక్క శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో టపాకాయలను పేల్చి, మిఠాయిలను పంచిపెట్టి ఆనందాన్ని వ్యక్తం చేశారు. శంకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ ప్రభంజనాన్ని నిరూపించారని అన్నారు. తెలంగాణలో సైతం నాలుగు ఎంపీ స్థానాల్లో బీజేపీ సత్తాను చాటి టీఆర్‌ఎస్‌కి గట్టి గుణపాఠం చెప్పారని అన్నారు.
బీజేపీ గెలుపు ఊహించినదే
వికారాబాద్: బీజేపీ గెలుపు ఊహించినదేనని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు టీ.సదానంద్ రెడ్డి అన్నారు. గురువారం దేశ వ్యాప్త ఎంపీ ఫలితాలపై మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రవేశపెట్టిన పథకాలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు కలిగించాయన్నారు. దేశ భద్రత విషయంలో మోదీ తీసుకునే నిర్ణయాలకు దేశ ప్రజలు ఎంతో సంతృప్తికరంగా ఉన్నారని అన్నారు. దేశ ప్రగతి మెరుగుపడేలా మోదీ తీసుకున్న నిర్ణయాలే బీజేపీ అధికారం చేపట్టేలా ప్రజలు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లు ప్రపంచంలో భారత్ నెంబర్ వన్‌గా నిలిచేలా మోదీ పాలన ఉండబోతుందని అభిప్రాయపడ్డారు.
కమలనాథుల సంబురాలు
మేడ్చల్: లోకసభ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి ఘనవిజయం సాధించడంతో గురువారం సాయంత్రం బీజేపీ శ్రేణులు మేడ్చల్‌లో విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహాం వద్ద రంగులు చల్లుకుంటూ సంబరాలను అంబరాన్నంటే విధంగా జరుపుకున్నారు. బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. తిరిగి కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ ఏర్పడుతుండటంతో నాయకులు, కార్యకర్తలు ఆనందంతో పరవశించిపోయారు. కార్యక్రమంలో నాయకులు మోహన్ రెడ్డి, జగన్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, వంశీ వంజరి, కిషన్‌రావు, లక్ష్మణ్, నాగరాజు, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, విష్ణువర్ధన్ రెడ్డి, కృష్ణగౌడ్, శ్రీనాథ్ రెడ్డి, రమేశ్, మల్లారెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, రవిచంద్ర, పోచయ్య, రాఘవ రెడ్డి, రాగం అర్జున్ పాల్గొన్నారు.
ఘట్‌కేసర్: కేంద్రంలో బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవటంతో రాష్ట్ర గిరిజన మోర్చ అధ్యక్షుడు నానావత్ బిక్కునాథ నాయక్ ఆధ్వర్యంలో గురువారం సంబురాలు జరుపుకున్నారు. పోచారం పురపాలక సంఘం అన్నోజిగూడ గ్రామంలోని జాతీయ రహదారిపై వందలాది నాయకులు, కార్యకర్తలతో కలిసి భారి ర్యాలీ నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు కలిసి మిఠాయిలు పంచుకున్నారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఐక్యంగా పోరాడినా మోదీ ధాటికి తట్టుకోలేక పోయారని విమర్శించారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా పాలన మరింత సమర్థవంతంగా కొనసాగనుందని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, గుండ్ల అంజనేయులు, రామోజీ పాల్గొన్నారు.
వనస్థలిపురం: దేశ వ్యాప్తంగా వెలువడిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో ఎన్‌డీఏ అధికారంలోకి రావడంతో తెలంగాణ బీజేపీ నేతలు సంబురాలు చేసుకున్నారు. అనూహ్యంగా తెలంగాణలో నాలుగు పార్లమెంట్ సీట్లు బీజేపీ కైవసం చేసుకోవడంతోని బీజేపీ నాయకులు మరింత ఉత్సహంతో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వనస్థలిపురంలో బాణసంచాలు కాల్చి, కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు.
ఎల్బీనగర్‌లో బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. బీజేపీ నేత ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, మోదీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను చూసి బీజేపీకీ మరోసారి ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీనీ ఆదరించినందుకు ప్రజలకు అబినందనలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొంతం బుచ్చిరెడ్డి, పోచంపల్లి గిరిధర్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
మహేశ్వరం: ప్రధాని నరేంద్ర మోదీ భరిష్మా ముందు దేశ వ్యాప్తంగా విపక్షాలు కుప్పకూలి పోయాయని ఎలాగైనా మోదీని గద్దె దించాలని కుటిల రాజకీయలకు తెరలేసిన ఏపీ సీఎం చంద్రబాబు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మెడలు వంచుతానని భీరాలు పలికిన కేసీఆర్, కేటీఆర్‌కు ప్రజలు తగిణ గుణపాఠం నేర్పారని మహేశ్వరం నియోజక వర్గం బీజీపీ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్ అన్నారు. గురువారం వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో అంచనాలకు మించి బీజీపీ విజయఢంకా మోగించడంతో నియోజకవర్గంలో బీజీపీ శ్రేణులు పెద్ద ఎత్తున బాణ సంచాలు కాల్చి, మిఠాయిలు పంచి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.
అందెల శ్రీరాములు మాట్లాడుతూ విపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా దేశ ప్రజలందరు మోదీ వైపు ఉన్నారని ఈ ఫలితాలు రుజువు చేశాయని విపక్షాలు ప్రజాతీర్పును గౌరవించక తప్పదని అన్నారు. దేశ భద్రత, రక్షణ బీజీపీతోనే సాధ్యమవుతుందని ప్రాంతీయ పార్టీలతో ఒరిగేదేమి లేదని ప్రజలు గుర్తించామని తెలిపారు. తెలంగాణలో బీజీపీ అభ్యర్థులు అనూహ్య విజయం సాధించడం వల్ల రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజీపీ మరింత బలపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజీపీ విజయోత్సవ సంబరాల్లో నాయకులు బీ.పాపయ్య గౌడ్, కే.జంగయ్య యాదవ్, మిద్దె సుదర్శన్ రెడ్డి, పీ.సుదర్శన్ యాదవ్, కే.ఆనంతయ్య గౌడ్, టీ.యాదీష్ పాల్గొన్నారు.
బీజేపీ గెలుపుతో
షాబాద్‌లో సంబురాలు
షాబాద్, మే 23: బీజేపీ గెలుపుతోషాబాద్‌లో యువకులు, బీజేపీ నాయకులు టపాసులు కాల్చి గురువారం సాయంత్రం సంబారాలు జరుపుకున్నారు. మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ్ధర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశం అభివృద్ది కొసం నిరంతరం కృషి చేస్తున్న నరేంద్రమోదీ నాయకత్వాని ప్రజలు గెలిపించారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలో బీజేపీకి నాలుగు సీట్లు గెలువడంతో తెలంగాణ ప్రాంతం వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని ప్రజలు ఆశీర్వాదిస్తారని వివరించారు. బారతదేశ రక్షణ కోసం బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి దేశం వరకు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే బీజేపీని మరింత బలోపేతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు రాము, కిరణ్, మహేందర్ పాల్గొన్నారు.
సంబరాలు జరుపుకున్న బీజేపీ నేతలు
మెహిదీపట్నం: పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ బీజేపీ ఘన విజయంతో నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గం పరిధిలలో పార్టీ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. గురువారం ఉదయం నుంచి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల ఫలితాల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పార్లమెంట్ స్థానాలలో విజయం సాధించింది. గత 70 యేళ్లే చరిత్రలో లేనటువంటి విజయం నేడు నరేంద్ర మోదీ 350 నియోజకవర్గం పరిధిలోని ఘన విజయం సాధించడం గోప్ప విషయం అని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నాంపల్లి నియోజకవర్గం ఇంచార్జీ దేవర కరుణాకర్ అన్నారు. మోదీ చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలే వల్లే గెలుపుసాధించడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాంలో కూడా బీజేపీ నాలుగు పార్లమెంట్ స్థానాలను సాధించడం మరింత గోప్ప విషయం అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ 16 పార్లమెంట్ నియోజకవర్గాలలో విజయం సాధింస్తారని పెద్ద పెద్ద ప్రకటనలు చేశారుని గుర్తుచేశారు. కానీ, ప్రజలు కేసీఆర్‌ను నమ్మడం లేదని ఈ ఎన్నికల్లో రుజువు అయిందని ఆరోపించారు. సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలలో బీజేపీ అభ్యర్థులు గెలుపోందడంతో టీఆర్‌ఎస్‌కు చెంపపెట్టు అని అన్నారు. సికింద్రాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ కుమారుడు సాయికుమార్ గెలుపు కోసం సర్వ విధాల ప్రయాత్నలు చేశారని పేర్కొన్నారు. చివరికి న్యాయం గెలిచిందని దేవర అన్నారు. కేసీఆర్‌కు గడ్డు పరిస్థితి వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ భారీ స్థాయిలో గెలుపోందడం ఖాయం అని అన్నారు.