రంగారెడ్డి

చటాన్‌పల్లి రైల్వే గేటు వద్ద మొరాయించిన రైలింజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, మే 24: రైల్వే గేటు వద్ద రైలు ఇంజన్ అర్ధగంటకు పైగా మొరాయించి నిలిచిపోవడంతో ఇరువైపుల వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో షాద్‌నగర్ రైల్వేస్టేషన్ నుండి కాచిగూడ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఇంజన్ చటాన్‌పల్లి రైల్వేగేటు వద్దకు రాగానే మొరాయించింది. రైలింజన్ ఎటూ కదలకపోవడం.. రైల్వే గేటు తెరవకపోవడంతో జనంఅనేక అవస్థలు పడ్డారు. దాంతో రైల్వే అధికారులు సకాలంలో స్పందించి రైల్వే ఇంజన్‌లో ఎక్కడ సాంకేతిక లోపం ఏర్పడిందనే విషయం తెలుసుకొని సరి చేశారు. ఈ పనులు చేసేవరకు ఒక గంట సమయం పట్టడంతో వేచి ఉన్న వాహనదారులు వెనుతిరిగి ఇతర ప్రాంతాల నుండి వెళ్లిపోయారు. దాంతో ఒక గంటసేపు ప్యాసింజర్ రైలు ఆలస్యంగా వెళ్లినట్లు రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ఒక గంట ఆలస్యంగా ప్యాసింజర్ రైలు వెళ్లడంతో రైల్లో ఉన్న ప్రయాణికులు ఎండ వేడిమికి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్లో నుండి బయటకు దిగి ఎప్పుడు సాంకేతిక లోపం సరిచేస్తారంటూ ప్రయాణికులు రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్యాసింజర్ రైలు చటాన్‌పల్లి రైల్వే గేటు వద్దనే నిలిచిపోవడంతో వచ్చిపోయే పలు రైళ్లు వివిధ రైల్వే స్టేషన్లలో నిలిపివేశారు. దాంతో ప్రయాణికులు, వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.