రంగారెడ్డి

గాలివాన బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాచారం, మే 25: మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో గురువారం రాత్రి గాలివాన భీభత్సాన్ని సృష్టించింది. మద్యాహ్నం ప్రారంభమైన కొద్ది పాటి వర్షం సాయంత్రానికి జడివానగా మారింది. పొద్దుపోయే వరకు భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో తాడిపర్తితో పాటు అనుబంధ గ్రామం అయన గొల్లగూడలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రెండు గ్రామాల్లోనూ విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం కారణంగా అంధకారం అలుముకుంది. గ్రామానికి చెందిన ముప్పిడి వెంకటయ్య, ముప్పిడి కాసీం, జహంగీర్, రవిలకు చెందిన ఇంటి పైకప్పులు ధ్వంసం అయ్యాయి. కుందారపు అంజయ్య ఇంటి ఎదుట విద్యుత్ స్తంభం కూలిపోయింది. కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరిపంట నీటమునగగా, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి.

పరిశ్రమల్లో కార్మికులకు రక్షణ ఏదీ?

* పారిశ్రామికవాడల్లో అధికారుల నిర్లక్ష్యం
* గాయాల పాలవుతున్న కార్మికులు

కొత్తూరు, మే 25: కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నా ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కొత్తూరులో పారిశ్రామికవాడ ఏర్పాటు తరువాత పని చేసే సమయంలో కార్మికులకు రక్షణ కరువవుతోంది. పారిశ్రామికవాడలో వందలాది చిన్న, మధ్య తరహా, పెద్ద పరిశ్రమలను స్థాపించి, వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వాలు, పరిశ్రమల యజమానులు కనీస రక్షణ సౌకర్యాల విషయంలో నిద్రమత్తులో జోగుతున్నారు. పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులు ప్రమాదాల బారిన పడటమే కాకుండా ప్రాణాలు సైతం కోల్పోయిన సంఘటనలు అనేకంగా ఉన్నాయి. కొత్తూరుతో పాటు నందిగామ మండలాల పరిధిలో ఉన్న వివిధ రకాల పరిశ్రమల్లో నిత్యం వేల సంఖ్యలో కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వివిధ రాష్ట్రాలు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది ఇక్కడకు వచ్చి ఉపాధి పొందుతున్నారు. కంపెనీలలో రక్షణ చర్యలు చేపట్టడంలో యాజమాన్యాలు విఫలమవుతున్నాయి. పరిశ్రమల్లో రక్షణ సౌకర్యాలు గానీ, వాటికి తగిన చర్యలు చేపట్టకపోవడంతో ఎంతో మంది కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారు. నందిగామ, కొత్తూరు మండలాల్లో మొత్తం 32గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో దాదాపు 64,245మంది జనాభా నివసిస్తున్నారు. అప్పట్లో వెనుకబడిన పాలమూరు జిల్లాను అభివృద్ధి దిశగా నడిపించేందుకు 1976వ సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళ్‌రావు కొత్తూరులో పారిశ్రామికవాడను ఏర్పాటు చేశారు. మొదట్లో పదుల సంఖ్యలో ఏర్పాటైన పరిశ్రమలు..ఆతరువాత వందల సంఖ్యకు చేరాయి. దీంట్లో రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి విచ్చేసిన వేలాది మంది పని చేస్తున్నారు. వేల సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు. స్థానికులే కాకుండా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, కర్ణాటక తదితర రాష్ట్రాల కార్మికులు వలస వచ్చి పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తూరు, నందిగామ మండలాలు రంగారెడ్డిలో కలిసినా కార్మికుల వెతలు మాత్రం తీరడం లేదు. కొత్తూరు, నందిగామ మండలాల్లో ప్రధానంగా స్టీలు, స్పాంజ్ ఐరన్, రసాయన, టైర్లు పరిశ్రమలు, సిలిండర్ పరిశ్రమలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో నాలుగు నుంచి ఆరు వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు. యాజమాన్యాలు మాత్రం కేవలం వందలోపు మందిని మాత్రమే కార్మికులుగా గుర్తించి ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నాయి. మిగతా కార్మికుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. ఈక్రమంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఈఎస్‌ఐ కార్డు లేకపోవడంతో సదరు కార్మికులు రోడ్డున పడుతున్నారు. మండలంలో అనుమతులు లేకుండా పాతటైర్లు కాల్చే పరిశ్రమలు, లెడ్ బట్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పారిశ్రామిక వాడ, కొత్తూరు, అంతిరెడ్డిగూడ, నందిగామ, తీగాపూర్ గ్రామ శివార్లలో పదుల సంఖ్యలో కాలుష్య పరిశ్రమలు వెలిశాయి. కార్మికులకు సరైన రక్షణ పరికరాలు లేకపోవడంతో మూడేళ్ల క్రితం తీగాపూర్ శివారులోని టైర్ల పరిశ్రమలో ప్రమాదం జరిగి నలుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. వీర్లపల్లి శివారులోని మూడేళ్ల క్రితం షెడ్ ఏర్పాటు పనుల్లో భాగంగా రేకులు వేస్తుండగా ఒడిశాకు చెందిన కార్మికుడు పై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. అలాగే ఆర్నెళ్ల క్రితం కర్నూల్ సిలిండర్ పరిశ్రమలో యంత్రాల మధ్య పనిచేస్తున్న ఓ కార్మికుడి చేతివేళ్లు ప్రమాదవశాత్తు తెగిపోయి గాయాలయ్యాయి. నందిగామ పారిశ్రామక ప్రాంతంలో నెలలో ఒకటో, రెండో ప్రమాద సంఘటనలు ఖచ్చితంగా చోటుచేసుకుంటాయని, కానీ చాలా వరకు వెలుగులోకి రావని వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు తెలుపుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగిన సందర్భాల్లో మాత్రమే సంబంధిత అధికారులు, కార్మిక నాయకులు హడావుడి చేస్తారు. మిగతా సందర్భాల్లో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదని సదరు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు భయంకర కాలుష్యం వెదజల్లుతూ..మరోవైపు కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పరిశ్రమల యాజమాన్యాలపై ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

కాంగ్రెస్ బలోపేతానికి కృషి :కూన
జీడిమెట్ల, మే 25: కాంగ్రెస్ బలోపేతానికి కలిసికట్టుగా కృషి చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ అన్నారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలుపొందిన సందర్భంగా షాపూర్‌నగర్‌లో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్‌ను పెద్దఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు కలిసి పుష్పగుచ్ఛాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పెద్దసంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.