రంగారెడ్డి

విద్యా వ్యవస్థను పటిష్టం చేయడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జూన్ 17: తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్టం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, కార్పోరేట్‌కు ధీటుగా గురుకుల పాఠశాలల్లో విద్యను అందిస్తున్నారని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. సోమవారం షాద్‌నగర్ పురపాలిక పరిధిలోని చటాన్‌పల్లి శివారులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొడంగల్ బీసీ గురుకుల బాలుర పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్‌తో కలిసి కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రారంభించారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య, రంగారెడ్డి జడ్పీవైస్ చైర్మెన్ ఈట గణేష్, ఎంపీపీ ఇద్రీస్ అహ్మద్ పాల్గొన్నారు.

నేటి నుంచి నట్టల నివారణ మందులు
షాబాద్, జూన్ 17: నేటి నుంచి 25 వరకు నట్టల నివారణ మందులు పశువులకు తప్పని సరిగా వేయించాలని మండల పశువైద్య అధికారి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. గ్రామాల్లో రైతులు అందుబాటులో ఉండి మూగజీవాలకు నట్టల మందును సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.