రంగారెడ్డి

పోసన్ చెరువుపై కబ్జాదారుల కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగి, జూన్ 17: కబ్జాకు గురవుతున్న చెరువుల విషయంలో అధికారులు చట్టరీత్యా తగు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఆయకట్టుదారులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మిషన్ కాకతీయ పథకంతో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టింది. పరిగి మండలంలో అన్ని చెరువులలో మిషన్ కాకతీయ కింద పూడికతీత పనులు, చెరువుకట్ట మరమ్మతులు జరుగుతున్నాయి. రూప్‌ఖాన్‌పేట్ స్టేజి దగ్గర పోసన్ చెరువు ఉంది. ఈ చెరువుకు మిషన్ కాకతీయ కింద 10 లక్షల రుపాయలు మంజూరై ఒండ్రు మట్టి చెరువు కట్ట నిర్మాణం పనులు చేశారు. హైదరాబాద్ - బీజాపూర్ హైవే రోడ్‌కు ఆనుకుని ఉండటంతో రియల్ వ్యాపారుల కన్నుపడింది. అధికారులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. పోసన్ చెరువుకు సంబంధించి రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలలో శిఖం, ఆయకట్టు రికార్డులు మాయం అయ్యాయి. ప్రభుత్వ కార్యాలయంలో చెరువు పేరు ఉంది. కానీ, సంబంధింత వివరాలు లేవని అధికారులు పేర్కొంటున్నారు. రియల్ వ్యాపారులు పోసన్ చెరువు శిఖంలో చెరువుకట్టను ఆనుకుని వెంచర్లు వేశారు. కబ్జాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానిక నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తన్నారు.
బంగారు మైసమ్మ వార్షికోత్సవం
ఉప్పల్, జూన్ 17: రామంతాపూర్ ఆర్టీసీ కాలనీలో ఉన్న శ్రీబంగారు మైసమ్మ ఆలయం 12వ వార్షికోత్సవ వేడుకలను భక్తిశ్రద్ధలతో భక్తులు నిర్వహించారు. వేద పండితుల మంత్రోశ్ఛరణలు, మంగళ వాయిద్యాల మధ్య జరిగిన వేడుకల్లో ఆలయ కమీటీ చైర్మన్ పసుల ప్రభాకర్ రెడ్డి, కాలనీ ప్రజలు, మహిళలు వందలాదిగా తరలి వచ్చి తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే తల్లిని ప్రత్యేకంగా అలకరించారు. అంతకు ముందు ప్రముఖ పురోహితులు రాంప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చనలు, అర్చనలు, పూజలు నిర్వహించారు.