రంగారెడ్డి

బంగ్లా బృందం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, జూన్ 17: రెవెన్యూ పనితీరును బంగ్లాదేశ్ సివిల్ సర్వీస్ అధికారుల బృందం సభ్యులు పరిశీలించారు. సోమవారం కొత్తూరు తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను సందర్శించి, రికార్డుల నమోదు ప్రక్రియ, పనితీరును స్థానిక రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ శాఖలో తీసుకువచ్చిన మార్పు, రికార్డుల నమోదుపై బంగ్లాదేశ్ బృందం సభ్యులు అభినందించారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ చట్టాలను బంగ్లాదేశ్‌లో అమలు చేసే విధంగా తగిన చర్యలు తీసుకోనున్నట్లు విదేశీ అధికార బృందం సభ్యులు తెలిపారు. రెవెన్యూ శాఖ నుండి రైతులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నామనే విషయాలను, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుభీమా, సబ్సిడీ పథకాలపై బంగ్లాదేశ్ బృందం వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతు శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిని, ప్రవేశ పెట్టిన పథకాలు ఎంతో అభినందనీయమని విదేశీ బృందం సభ్యులు ప్రశంసించారు. కార్యక్రమంలో షాద్‌నగర్ ఆర్‌డీఓ ఎం.కృష్ణ, కొత్తూరు తహశీల్దార్ వెంకట్ రెడ్డి, బంగ్లాదేశ్ సివిల్ సర్వీస్ అధికారుల బృందం సభ్యులు అబ్దుల్ హమీద్, ఖలీద్ రహీం, అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజ్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ ఫ్రొఫెసర్ హుమేరా అంజూమ్‌తో పాటు 33మంది బృందం సభ్యులు పాల్గొన్నారు.