రంగారెడ్డి

జర్నలిస్టులు అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, జూన్ 18: జిల్లాలో పని చేస్తున్న జర్నలిస్టులు 2019-20 సంవత్సరానికి ఈనెల 25వతేదీలోపు అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే అక్రిడేషన్ పొందిన జర్నలిస్టులు అక్రిడేషన్ గడువు జూన్ 30వతేదీతో ముగుస్తుందని, ఈనెల 18వతేదీ నుంచి దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు తమ లెటర్ హెడ్‌పై జిల్లాలో తమ ఆర్గనైజేషన్ నుంచి పని చేస్తున్న వారి పేర్లతో కూడిన హార్డ్‌కాపీని జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే వారు హెచ్‌టీటీపీ / ఐపీఆర్.తెలంగాణ. జీఒవీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న వారు జూలై 1నుంచి నుంచి అక్రిడేషన్ పొందవచ్చునని కలెక్టర్ వివరించారు.
గొర్రెలకు నట్టల నివారణ టీకాలు తప్పనిసరి
కీసర, జూన్ 18: గొర్రెలకు నట్టల నివారణ మందులు తప్పనిసరిగా వేయించాలని జడ్పీటీసీ బండారు రమాదేవి పేర్కొన్నారు. మంగళవారం పశు వైద్యాధికారి జెవ్యానాయక్ కీసరలో గొర్రెలకు నట్టల నివారణ మందులు వేసారు. ముఖ్యఅతిథిగా రమాదేవి హాజరై గొర్రెలకు నట్టల నివారణ మందులు వేసా రు. సర్పంచ్ నాయకపు మాధురి, ఇన్‌చార్జి ఎంపీపీ మాదిరెడ్డి స్వప్న వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ బాలమణి, వెటర్నరీ అధికారి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
కొత్తూరు: మూగజీవాలకు నట్టల నివారణ టీకాలు, మందుల పంపిణీ చేశారు. మంగళవారం కొత్తూరు మండల పరిధిలోని గూడూరు, మక్తగూడ, గూడూరు తండాలలో పశువైద్యాధికారి డాక్టర్ స్ఫూర్తి ఆధ్వర్యంలో 348గొర్రెలు, 659మేకలకు నట్టల నివారణ టీకాలు వేసి, మందులను సరఫరా చేశారు. సర్పంచ్‌లు రాజు, రవి, లక్ష్మణ్‌నాయక్ పాల్గొన్నారు.