రంగారెడ్డి

అంగన్‌వాడీ సమస్యలను పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జూన్ 18: అంగన్‌వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సీఐటీయు నేత బీసా సాయిబాబా డిమాండ్ చేశారు. మంగళవారం షాద్‌నగర్ సీడీపీవో నాగమణికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. బీసా సాయిబాబా మాట్లాడుతూ అంగన్‌వాడి కేంద్రాలకు నేరుగా బియ్యాన్ని సరఫరా చేయడంతోపాటు ట్రాన్స్‌పోర్టు ఖర్చులను ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతినెల వేతనాలు మొదటి వారంలో ఇవ్వడంతోపాటు మెసేజ్‌లో వేతనం చెల్లించే నెలను తప్పనిసరిగా నమోదు చేయాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న ఏడు జతల యూనిఫామ్‌ను తక్షణమే విడుదల చేయాలని, కలర్ మార్చి క్వాలిటి మెటిరీయల్‌ను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు అవసరమైన రిజిస్ట్రేషన్లను సరఫరా చేయడమే కాకుండా వాటి జిరాక్స్‌కు అయ్యే ఖర్చులను ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడి ఉపాధ్యాయులు జయమ్మ, శ్రీదేవి, ఇందిరా లలితా, సుజాత, నిర్మల పాల్గొన్నారు.
విద్యార్థులకు నోట్‌పుస్తకాల పంపిణీ
కొందుర్గు, జూన్ 18: విద్యార్థులకు అవసరమైన నోట్‌పుస్తకాలు, పెన్నులు, జామెంట్రీ బాక్స్‌లను ఉచితంగా పంపిణీ చేశారు. మంగళవారం కొందుర్గు మండలం గంగన్నగూడెం గ్రామ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు ఉపసర్పంచ్ చిట్టెం లక్ష్మీకాంత్ రెడ్డి సహకారంతో నోట్ పుస్తకాలు, పెన్నులు, జామెంట్రీ బాక్స్‌లను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అవసరమైన సహాయం అందించడానికి తాను ఎల్లప్పుడు ముందుంటానని పేర్కొన్నారు. పాఠశాలకు, విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందించడానికి దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు లింబ్యా నాయక్, తిరుపతిరెడ్డి, హన్మంతు, రాజు, సంజీవ్‌రెడ్డి, యాదగిరి, ఉపాధ్యాయులు శ్రీశైలం పాల్గొన్నారు.
ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు తప్పనిసరి
షాద్‌నగర్ రూరల్, జూన్ 18: గ్రామంలోని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మరుగుదొడ్లు నిర్మించుకోవాలని విఠ్యాల సర్పంచ్ జయశ్రీ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఫరూఖ్‌నగర్ మండలం విఠ్యాల గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఏడుగురు లబ్దిదారులకు రూ.12వేల చొప్పున నగదును అందజేశారు.
సర్పంచ్ జయశ్రీ చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి చెందాలంటే ముందుగా పరిశుభ్రత పాటించాలని, దానికోసం ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. గ్రామంలో వందశాతం మరుగుదొడ్ల లక్ష్యం పూరె్తైతే స్వచ్ఛ విఠ్యాల.. స్వచ్ఛ భారత్ సాధించవచ్చని వివరించారు. మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వమే ఆర్థిక సాయం అందజేస్తుందని అన్నారు. గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందే విధంగా కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేందర్, మహిళా సంఘం అధ్యక్షురాలు వెంకటమ్మ, వార్డు సభ్యులు రఫీక్, వీఓఏ మోయినోద్దీన్, కారోబార్ శ్రీనివాస్, మహ్మద్ నజీర్ పాల్గొన్నారు.