రంగారెడ్డి

అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, జూన్ 18: అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటిస్తూ గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సూచించారు. మంగళవారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపీనగర్, నెహ్రూనగర్‌లలో రూ.1కోటి అంచనా వ్యయంతో చేపట్టనున్న భూగర్భ మురుగునీటిపారుదల వ్యవస్థ నిర్మాణ పనులను శేరిలింగంపల్లి సర్కిల్ 20 డీఈ శ్రీనివాస్‌తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గాంధీ చెప్పారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు ఎం.రాజు యాదవ్, బద్దం కొండల్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, గంగ లక్ష్మారెడ్డి, ఎంవీ ప్రసాద్, చైతన్య, కాలనీవాసులు ఉన్నారు.

మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి
వికారాబాద్, జూన్ 18 : మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఎం.నారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. మాట్లాడుతూ.. పోలీస్‌స్టేషన్‌ల వారిగా పెండింగ్‌లో ఉన్న మిస్సింగ్ కేసులపై ఎలాంటి పురోగతి ఉందని అడిగి తెలుసుకున్నారు. కేసుల పరిష్కార విషయంలో పూర్తి బాధ్యత ఎస్‌హెచ్‌ఓలదేనని తెలిపారు. ఇట్టి కేసుల్లో మరోసారి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మిస్సింగ్ వారి గుర్తింపు ఫోటోలను జన సంచారం ఉన్న ప్రదేశాల్లో, బస్టాప్‌ల్లో, రైల్వే స్టేషన్‌లలో ప్రదర్శించాలని అన్నారు. బార్డర్ పోలీస్ స్టేషన్‌లకు సమాచారం అందించి నూతన టెక్నాలజీ ద్వారా మిస్సింగ్ కేసులను చేధించాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ భాస్కర్, తాండూరు డీఎస్పీ రామచంద్రుడు పాల్గొన్నారు.