రంగారెడ్డి

పశుపోషణతో ఆర్థిక సాధికారత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాచారం, జూన్ 18: గ్రామీణ ప్రాంతాల్లోని గొల్ల, కురుమ కులస్తులు పశుపోషణతో ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర పశుసంవర్థక సంక్షేమ శాఖ, మత్స్య, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. మంగళవారం మండల పరిధిలోని చింతపట్ల గ్రామంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులను స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని గొల్లకురుమలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మరకు రూ.5వేల కోట్ల రూపాయల ఖర్చుతో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. గొర్రెల సంరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాథాన్యతనిస్తోందని, 75 శాతం సబ్సిడీపై గడ్డి విత్తనాలు, దానా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మొబైల్ ఆంబులెన్స్ ఫోన్‌కాల్ 1962 ద్వారా గ్రామ సంచార వైద్య చికిత్స అందిస్తామని తెలిపారు. రిలయన్స్ టోల్ ఫ్రీ నంబర్ 1800 4198800 ద్వారా రైతులకు ఉచిత సమాచారాన్ని అందిస్తామని చెప్పారు. ప్రతి కుటుంబాన్ని ఏ, బీ బృందాలుగా ఏర్పాటు చేసి గొర్రెలను పంపిణీ చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తరుపున పెట్టుబడి, గొర్రెలు, మేకల పెంపకం దారులకు గొర్రెల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, టిఎస్‌ఎల్‌డీఎ సీఈఓ మంజువాణి, మత్స్యశాఖ ఎండి లక్ష్మారెడ్డి, జడ్పీటీసీ రమేశ్ గౌడ్, ఎంపీపీ రజితరాజు, మండల పశువైద్యాధికారి వనజకుమారి, పీఎసీఎస్ చైర్మన్ సుదర్శన్ రెడ్డి, ఉప సర్పంచ్ వెంకటేశ్ పాల్గొన్నారు.