రంగారెడ్డి

గురు పౌర్ణమి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్: గురు పౌర్ణమి వేడుకలు పరిసర ప్రాంతాలలో భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. వేద పండితుల మంత్రోశ్ఛరణలు, మంగళవాయిధ్యాల మధ్య పట్టణంలోని అన్ని సాయి మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. చిల్కానగర్, హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్, బోడుప్పల్, చెంగిచర్ల, మేడిపల్లి, పీర్జాదిగూడ, పర్వతాపూర్‌లోని సాయి బాబ ఆలయాలలో ప్రత్యేక పూజలతో పాటు హారతులు, అర్చనలు, అన్నదానం కార్యక్రమాలు హోరెత్తించాయి. హబ్సిగూడ రవీంద్రనగర్‌లోని సాయిబాబ ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ బేతి స్వప్న, ఉప్పల్ సాయినగర్‌లో స్థానిక కార్పొరేటర్ మేకల అనలా రెడ్డి, నల్లచెరువు కట్ట కింద సాయి నిలయంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి.
జీడిమెట్ల: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గురుపౌర్ణమి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. సాయినాథుని మందిరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గాజులరామారం, జగద్గిరిగుట్ట, రంగారెడ్డి నగర్, చింతల్, సూరారం, సుభాష్‌నగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల డివిజన్‌లతో పాటు దుందిగల్, గాగిల్లాపూర్, దొమ్మరపోచంపల్లి, బౌరంపేట్, మల్లంపేట్, బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతినగర్, బహద్దూర్‌పల్లి, దూలపల్లి, కొంపల్లి గ్రామాలలో గురుపౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సాయిబాబా మందిరాల్లో అన్నదానం చేసారు. నిజాంపేట్ సాయిబాబా మందిరంలో, రాజీవ్ గృహకల్పలో తెరాస నేత కొలను శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. జీడిమెట్ల డివిజన్ బౌద్ధనగర్, బ్యాంక్ కాలనీ, భాగ్యలక్ష్మీ కాలనీలలో గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయాల్లో టీఆర్‌ఎస్ యువ నాయకుడు కేపీ విశాల్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశాడు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
షాద్‌నగర్ రూరల్: ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లిదండ్రులు..ఆ తరువాత మనకు జ్ఞానాన్ని అందించి, ఏది మంచిదో, ఏదీ చెడో చెప్పేవారు గురువులు..అలాంటి గురువులను పూజించడం కోసం నిర్ణయించిన తిథినే గురుపౌర్ణమి లేక వ్యాస పౌర్ణమి అంటారు. ‘గు’ అంటే అంధకారం లేదా అజ్ఞానం, ‘రువు’ అంటే నశింపజేయడం, నిరోధించుట, పారద్రోలుట అనే అర్థాలు వస్తాయి. అంటే గురువు అనే పదానికి అజ్ఞానాన్ని నశింపచేయువారు అని అర్థం. భారతదేశ సంస్కృతిలో గురువుకు చాలా ఉన్నత స్థానం ఉంది.
షాద్‌నగర్: మనకు విద్యాబుద్ధులు నేర్పించి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించిన గురువులే ప్రత్యక్ష దైవాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ అన్నారు. సోమవారం షాద్‌నగర్ పట్టణంలోని శ్రీషిరిడిసాయి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
కొత్తూరు రూరల్: గురుపౌర్ణిమ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సోమవారం నందిగామ మండలం చేగూర్ గ్రామంలోని సాయిబాబా ఆలయ ధర్మకర్త మామిడి జయశ్రీ శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురుపౌర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నందిగామ ఎంపీపీ మంచన్‌పల్లి ప్రియాంక శివశంకర్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
రాజేంద్రనగర్: సాయినాథుని దయతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అత్తాపూర్ కార్పొరేటర్ రావుల విజయ జంగయ్య అన్నారు. గురుపౌర్ణమి వేడుకలను పురస్కరించుకొని మంగళవారం అత్తాపూర్ డివిజన్ పరిధిలోని సాయిబాబా మందిరంలో స్వామివారికి పూజలు నిర్వహించారు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి అంతఃకరణాన్ని శుద్ధిచేసే మహిమాన్విత రూపమని కొనియాడారు.
కేపీహెచ్‌బీకాలనీ: గురు పౌర్ణమిని పురస్కరించుకుని కేపీహెచ్‌బికాలనీ రోడ్డు నెంబర్ 2లోని సాయిబాబా ఆలయంలో మంగళవారం నిర్వహించిన వేడుకలకు డివిజన్ కార్పొరేటర్ పన్నాల కావ్య హరీష్‌రెడ్డి దంపతులు పాల్గొని సద్గురు సాయినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రావు, పార్వతీదేవి, రాజా, ప్రేమ్‌కుమార్, కృష్ణారావు, సుబ్బారావు పాల్గొన్నారు.
వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకలకు సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ విచ్చేసి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ రాజేశ్వర్ రావు, నాయకులు సంజీవ రెడ్డి, శ్రీకాంత్, చంద్రకాంత్‌రావు, శ్రీనివాస్, కార్తీక్‌రావు, సంతోష్ రావు, రాజేందర్ పాల్గొన్నారు.
మహేశ్వరం: సాయి బాబా ఆలయంలో మంగళవారం గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున్న పోటెత్తారు. ఉదయం కాకడా హారతి అభిషేకం, పూర్ణాహుతి మహానివేదన, హారతి నిర్వహించారు. ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకుడు క్యామ మల్లేష్ , రాష్ట్ర ఎస్‌ఎఫ్‌సీ చైర్మన్ రాజేశం గౌడ్ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రావిర్యాల, సర్ధార్‌నగర్ గ్రామాల మధ్యన వెలసిన శ్రీసూర్యగిరి రేణుక ఎల్లమ్మ ఆలయానికి భక్తులు అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున బారులు తీరారు. ఆషాఢమాసం, గురుపౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చారు. అమ్మవారి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వత్రాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
ఘట్‌కేసర్: గురుభక్తి కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానాలను అధిరోహించి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారని ఘట్‌కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఘట్‌కేసర్ పట్టణం శివారెడ్డిగూడలోని శ్రీసాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కొంతం అంజిరెడ్డి, మండల సహకార సంఘం మాజీ చైర్మన్ సార శ్రీనివాస్ గౌడ్ మంగళవారం పూజలు జరిపారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నోముల నవీన్ ప్రకాష్, గొంగళ్ల బాలేష్ కుర్మ, మాజీ ఎంపీటీసీ మేకల నర్సింగ్ రావు, మెరుగు నరేష్ గౌడ్, భానుప్రకాష్ గౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు కొంతం రాంరెడ్డి, సభ్యులు కొంతం నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.
వనస్థలిపురం: బాలాజీ నగర్ ఆలయ కమిటీ చైర్మన్ ముడుపు జయా యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో బాబా దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టారు. పరిసర ప్రాంతాలకు చెందిన కాలనీ వాసులు హాజరై బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ముడుపు సందీప్ రెడ్డి, లచ్చిరెడ్డి, వెంకట్ రెడ్డి, సుధీర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.
మన్సూరాబాద్ డివిజన్ సెంట్రల్ బ్యాంక్ కాలనీలోని ఉమా నాగలింగేశ్వర ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు హాజరై బాబాను దర్శించుకున్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు జక్కిడి క్రాంతిదేవ్ రెడ్డి, జక్కిడి ప్రసన్న, కాలనీ వాసులు నర్సింహ గౌడ్, సత్యనారాయణ, లక్ష్మణ్ పాల్గొన్నారు.