రంగారెడ్డి

విష జ్వరాలతో విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, జూలై 16: గిరిజన తండాలో విషజ్వరాలు విజృంభిస్తుండటంతో గిరిజనులు ఆసుపత్రుల పాలవుతున్నారు. కొత్తూరు మండలం ఏనుగులమడుగు తండా గ్రామ పంచాయతీ పరిధిలోని పులిచర్లకుంటతండాలో విషజ్వరాలతో గిరిజనులు అల్లాడిపోతున్నారు. వైద్యసేవలు అందించాలని కొత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తే చూసి చూడనట్లు వ్యవహరించడమే కాకుండా రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని గిరిజనులు వాపోతున్నారు. దాంతో ఏమి చేయాలో తెలియక కొత్తూరు మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూయించుకోవడమే కాకుండా షాద్‌నగర్ పట్టణానికి వెళ్తున్నామని వివరిస్తున్నారు. కొత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి తండాలో విషజ్వరాల భారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైద్యులకు వివరిస్తే తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని తండావాసులు వాపోయారు. పులిచర్లకుంటతండాలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పంచాయతీ అధికారులకు సైతం విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తండాలో చిన్నా, పెద్ద, వృద్ధులు అనే తేడా లేకుండా విషజ్వరాలకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారని పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సకాలంలో స్పందించి గిరిజన తండాలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడంతోపాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని తండావాసులు డిమాండ్ చేస్తున్నారు.

చేవెళ్ల సీఐగా బాలకృష్ణ
షాబాద్, జూలై 16: చేవెళ్ల సీఐగా సీహెచ్ బాలకృష్ణ మంగళవారం పదవీ బాధ్యతలు తీసుకున్నారు. చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. గ్రామాల్లో గస్తీ నిర్వహించేవిధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.