రంగారెడ్డి

ఆరుగురు బాల కార్మికులకు విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూలై 16: ఆరుగురు బాలకార్మికులకు ఆపరేషన్ ముస్కాన్ బృందం విముక్తి కలిగించిన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. డీసీపీయూ ప్రొటెక్షన్ అధికారి విజయలక్ష్మి, కూకట్‌పల్లి ముస్కాన్ ఆపరేషన్ ఇంచార్జి నర్సింహ, సిబ్బంది అభిలాష్, రవిలు బాచుపల్లి పీఎస్ పరిధిలో గస్తీ నిర్వహించారు. వెస్ట్‌బెంగాల్‌కు చెందిన సోయల్ (16), గుంటూరుకు చెందిన వీరాంజనేయులు (17), ఈస్ట్‌గోదావరికి చెందిన ధర్మరాజు (14), బిహార్‌కు చెందిన సాహెబ్ ఖాన్ (16), సంగారెడ్డికి చెందిన సంతోష్ (14), వనపర్తికి చెందిన శివ (14)లు బాచుపల్లి, నిజాంపేట్ ప్రాంతాలలో నివాసముంటూ బాల కార్మికులుగా పనిచేస్తున్నారు. గస్తీలో భాగంగా ఆపరేషన్ ముస్కాన్ బృందం అధికారులు బాల కార్మికులుగా ఉన్న బాలలను విముక్తి కలిపించి వారికి ఆశ్రయం కల్పించేందుకు కూకట్‌పల్లి రెస్క్యూ హోమ్‌కు తరలించారు.