రంగారెడ్డి

కీసరగుట్టలో శాకంబరీ ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, జూలై 18: కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో గురువారం శాకంబరీ ఉత్సవాలు వేద మంత్రోచ్చరణాల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ చైర్మన్ టీ.నారాయణ శర్మ దంపతులు గణపతి పూజ, కలశపూజ, మండపారాధన, రుద్రహోమం తదితర పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద పండితులు అమ్మవారికి అశేష పూజలు కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూజానంతరం ఆలయ అన్నదాన సత్రంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఒ లక్ష్మీ నర్సింహ మూర్తి, పండితులు బలరాం శర్మ, రవిశర్మ, రమేశ్ శర్మ, వెంకట్ రావు, అనిల్ పాల్గొన్నారు.
ప్రధాన కూడళ్లల్లో ట్రాఫిక్‌కు
అంతరాయం
నార్సింగి, జూలై 18: ప్రధాన రహదారులపై సంతలను ఏర్పాటు చేసుకోవడంతో ప్రధాన కూడళ్లల్లో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారులపై సగం రోడ్డు వరకు సంతలను ఏర్పాటు చేయడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు, పాదచారులకు రాకపోకలు సాగించడంలో అసౌకర్యానికి గురవుతున్నారు. బస్సులు సైతం వెళ్లడానికి వీలు లేకుండా చిరువ్యాపారులు రోడ్లను ఆక్రమిస్తున్నారు. వారంలో ఒక్క రోజు మున్సిపల్ పరిధిలోని ఏదో ఒక ప్రాంతంలో ఈ సంతలను ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వ్యాపారులు తమ ఇష్టానుసారం ప్రధాన రహదారులపైనే వీటిని ఏర్పాటు చేయడంతో సమస్య వచ్చిపడిందని స్థానికులు తెలుపుతున్నారు.

సబ్జిమండి నల్లపోచమ్మ,
మహాంకాళీ దేవి సీడీ ఆవిష్కరణ
మెహిదీపట్నం, జూలై 18: కార్వాన్ సబ్జిమండి శ్రీనల్లపోచమ్మ దేవి, శ్రీమహాంకాళీ దేవి అమ్మవార్లు సీడీని గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బోనాల ఉత్సవాలు అంత్యంత్త వైభంవంగా కొనసాగుతున్నాయని తెలిపారు. బోనాల ఉత్సవాలను నగర ప్రజలు ప్రశాంతమైన వాతావారణంలో జరుపుకోవాలని పిలుపు నిచ్చారు. దేవాలయం అధ్యక్షుడు అవుట్‌శెట్టి ఎం.శ్యాంసుందర్, ఉపాధ్యక్షుడు గుడుమని అశోక్ కుమార్, గాండ్ల నిరంజన్ బాబు, ప్యాటా నందకిషోర్, అల్లి దర్శన్, ప్రధాన కార్యదర్శి సీహెచ్ పద్మరావు, సలహాదారులు నాస జ్జానేశ్వర్, కట్ట నర్సింగ్ రావు పాల్గొన్నారు.