రంగారెడ్డి

సెయింట్ ఆన్స్ కాలేజీలో హరివిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెహిదీపట్నం, జూలై 20: సెయింట్ ఆన్స్ బాలికల కళాశాల అత్యున్నత విలువతో కూడిన విద్యను అందిస్తున్నదని రాష్ట్ర ఉన్నత విద్య ప్రిన్స్‌పల్ సెక్రెటరీ డా.బి.జనార్ధన్‌రెడ్డి అన్నారు. శనివారం ఉదయం మెహిదీపట్నం సెయింట్ ఆన్స్ బాలికల కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్ధినులకు ద్వితీయ సంవత్సరపు విద్యార్ధినులు స్వాగత కార్యక్రమం రంగుల హరివిల్లు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ ఆహూతులు డా.స్మిత అస్తనా, విద్యాజ్యోతి ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ ఆచార్య డా.సత్యనారాయణ పాల్గొన్నారు.
ఆగస్టు నాటికి అంగన్‌వాడీలకు చరవాణి
వికారాబాద్, జూలై 20: అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్యతో సహా పంపిణీ చేసిన సరుకు, భోజనం ఇతర వివరాలను అన్నింటిలో స్మార్ట్ ఫోన్‌లో నమోదు చేసి ఎప్పటికప్పుడు నివేదిక అందించేలా చర్యలు తీసుకోనున్నారు. అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు అందించేందుకు సంబంధిత శాఖ సిద్దమైంది. వచ్చే ఆగస్టు నెల లోపు అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు ఉచితంగా పంపిణీ చేసి పారదర్శకతను చాటి చెప్పనున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టనున్నారు.
శ్రీ రేణుకా ఎల్లమ్మ కల్యాణోత్సవం
ఉప్పల్, జూలై 20: రామంతాపూర్ భరత్‌నగర్‌లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ద్వాదశ వేడుకల్లో భాగంగా శనివారం ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోశ్ఛరణలు, మంగళ వాయిధ్యాల మధ్య జరిగిన వేడుకల్లో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, స్థానిక కార్పొరేటర్ గంధం జ్యోత్స్న నాగేశ్వర్, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎస్.రాంరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వ మానవ కల్యాణం కోసం రేణుకా ఎల్లమ్మ దేవాలయ కమిటీ చేపట్టిన శాస్త్రోక్త పూజలు అపూర్వ రీతిలో కొనసాగాయన్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు తరలి వచ్చి పూజలు నిర్వహించారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లి రేణుకా ఎల్లమ్మ తల్లికి మహిళలు బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రధాన అర్చకులు శ్యాంమోహనాచార్యులు, పులి జగన్, చంద్రపాల్, కే.వెంకటేశ్ పాల్గొన్నారు.
పేద విద్యార్థులకు రోటరీ క్లబ్ చేయూత
ఉప్పల్, జూలై 20: మేడిపల్లిలోని ప్రభుత్వ జిల్లాపరిషత్ హైస్కూల్‌లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వాటర్ బాటిళ్లతో పాటు యాంటీ సెప్టిక్ సోప్స్, వానటరీ న్యాప్‌కిన్స్‌ను క్లబ్ మాజీ గవర్నర్ డాక్టర్ ఎంపల్లి బుచ్చిరెడ్డి అందజేశారు. కార్యక్రమంలో సహాయ గవర్నర్లు ఎంపల్లి అనంతరెడ్డి, అధ్యక్షుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి, కార్యదర్శి గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి, కోశాదిగారి నవీన్ రెడ్డి, సభ్యులు జంగా రెడ్డి, హరిబాబు, సంపత్, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, అభిలాష్ రెడ్డి పాల్గొన్నారు.