రంగారెడ్డి

టీడీపీకి ప్రజలతో విడదీయరాని బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, జూలై 21: తెలుగుదేశం పార్టీకి ప్రజలతో వీడదీయరాని బంధం ఉంది. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు నిరంతరాయంగా ప్రజాసేవలో నిమగ్నం కండి అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం తనను కలిసిన తాండూరు నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలకు సూచించారు.
ప్రస్తుతం టీడీపీ ఆపదలో ఉందనే నిరుత్సాహం వీడండి భివిష్యత్తు మనదే అని చంద్రబాబు పార్టీ నాయకులకు భరోసా ఇచ్చారు. తెలంగాణలో నేటికి తెలుగుదేశం పట్ల ప్రజల్లో అఖండ ఆదరణ ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ పూర్వ వైభవం సాధిస్తుందని నాయకులకు ధైర్యం నూరి పోసినట్లు అరవింద్ కుమార్, హన్మంతు, రాజు తమ ప్రకటనలో వెల్లడించారు. వీలయినంత త్వరలో చంద్రబాబు తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటించి పార్టీ శ్రేణులతో సమీక్షలు జరుపుతున్నట్లు వారు తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తాండూరు మున్సిపాలిటీలో తమ సత్తా చాలాలని అత్యధికంగా మున్సిపల్ వార్డులను కైవససం చేసుకోవాలని వెల్లడించారు.
యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ
శేరిలింగంపల్లి, జూలై 21: యోగాకు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించడం భారతదేశ ఔన్నత్యానికి నిదర్శనమని పతంజలి తెలంగాణ మహిళా అధ్యక్షురాలు మంజుశ్రీ నాయర్ అన్నారు. ప్రధాన మంత్రి వికాస్ యోజన ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ పరీక్షలో అర్హత పొందిన 13 మంది సహ యోగా గురువులను గుల్‌మొహర్ కాలనీ ఉద్యానవనంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో అభినందించారు.
యోగా మనం నేర్చుకుని నలుగురికి నేర్పించాలని కాలనీ అధ్యక్షుడు ఎస్‌కే ఖాసీం చెప్పారు. ఆగస్టు 1వ తేదీ నుంచి గుల్‌మొహర్ కాలనీ పార్కులో సహ యోగా గురు శిక్షణ మొదలవుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యోగా గురు నూనె సురేందర్ పిలుపునిచ్చారు. ఇందులో కాలనీ ప్రధాన కార్యదర్శి జునూతల నిరంజన్ రెడ్డి, నేతాజీనగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బేరి రాంచందర్ యాదవ్, యోగా సీనియర్ గురు రాజేందర్, సహ యోగా గురు వెంకటేష్ గారెల ఉన్నారు. సర్ట్ఫికెట్లు అందుకున్న వారిలో నూనె సురేందర్, సాయిప్రియ, ఉదయకుమారి, శంకర్ యాదవ్, దీపా యాదవ్, విఠల్‌రావు, హరికృష్ణ, మూర్తి, సుస్మిత, రవికాంత్, సంధ్యారాణి ఉన్నారు.
ఎల్బీనగర్‌లో బీజేపీ పటిష్టానికి కృషి
వనస్థలిపురం, జూలై 21: ఎల్బీనగర్‌లో బీజేపీనీ తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడానికి కార్యకర్తలు కష్టపడి పని చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కట్ట సుధాకర్, బీజేపీ రాష్ట్ర నాయకుడు పేరాల శేఖర్ రావు పిలుపు నిచ్చారు. ఆటోనగర్‌లోని కర్నాటి గార్డెన్‌లో రంగారెడ్డి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీజేపీ సభ్యత్వాల నమోదు కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను పెద్దఎత్తున ప్రచారం నిర్వహించి ప్రజలకు తెలిసే విధంగా నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించాలని తెలిపారు. బీజేపీ జిల్లా నాయకుడు బొక్క నర్సిరెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 30వేల సభ్యత్వాలు నమోదు చేయడానికీ ప్రతి ఒక్కరూ పని చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బద్దం సుభాష్ రెడ్డి, ఆకుల రమేష్ గౌడ్, కొత్త రవీంధర్ గౌడ్, ఊర నర్సింహా గుప్తా, కటకం నర్సింగ్ రావు, డివిజన్ అధ్యక్షుడు ఉగాది ఎల్లప్ప, శంకర్ పాల్గొన్నారు.