రంగారెడ్డి

సంప్రదాయబద్ధంగా బోనాల పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్: మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని పలు కాలనీలతో పాటు అత్వెల్లిలో ప్రజలు ఆదివారం బోనాల పండుగను సంప్రదాయబద్ధంగా భక్త్భివంతో వైభవంగా జరుపుకున్నారు. పట్టణంలోని ఏడుగుళ్ల ఆలయంలో, ఉమానగర్, ఆర్టీసీ కాలనీ, తదితర కాలనీలతో పాటు అత్వెల్లి పోచమ్మ, దుర్గమ్మ అమ్మవార్లకు బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలో కూడా బోనాల పండుగను ఆదివారం ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకున్నారు. మహిళలు తెలుగుదనం ఉట్టిపడే విధంగా సంప్రదాయంగా ముస్తాబై నెత్తిన బోనాలతో బాజభజంత్రీల మధ్య ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవార్లకు బోనం నైవేథ్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లను మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్, నాయకులు శేఖర్ గౌడ్, రవీందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, సందీప్ గౌడ్, నర్సింహా రెడ్డి పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి తరించారు. వివిధ యువజన సంఘాల ఆధ్వర్యంలో అమ్మవార్లకు ఫలహారబండ్లు, తొట్టెలు పోటాపోటీగా ఊరేగింపుగా తీన్మార్ నృత్యాలతో తరలిచ్చి అమ్మవార్లకు సమర్పించారు. పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గుండ్లపోచంపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున్, మధు, రాజు, మనిష్, రాజు, శేఖర్, గోపాల్, హేమంత్, నాగరాజు, అఖిల్ పాల్గొన్నారు.
కేపీహెచ్‌బీకాలనీ: ఆషాడ మాస బోనాలను పురస్కరించుకుని ఆదివారం జేఎన్‌టీయూహెచ్‌లో శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు వైస్ ఛాన్సలర్ ఎ.వేణుగోపాల్ రెడ్డి, రెక్టార్ ఏ.గోవర్ధన్, రిజిస్ట్రార్ ఎన్.యాదయ్య పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సాయిబాబా రెడ్డి, జీఎన్ శ్రీనివాస్, నర్సింహా రెడ్డి, బాలు నాయక్, మార్కండేయ, దామోదరం, నాన్ టీచింగ్ అసోసియేషన్ సభ్యులు దామోదర్ రెడ్డి, జీ.బాల్‌రాజు, వెంకటేష్, రవికుమార్, శంకర్ పాల్గొన్నారు.