రంగారెడ్డి

జీపీ నిధులపై ఫ్రీజింగ్ ఎలా పెడతారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూలై 23: సర్పంచ్ ఉపసర్పంచ్‌లకు కలిపి జాయింట్ చెక్ పవర్ కల్పించడంతో గ్రామాల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడుతున్నదని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధానంలో కీలకపాత్ర పోషించే సర్పంచ్‌లకు సీఎం కేసీఆర్ స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలని రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల సర్పంచ్‌లు మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం పూడూరులోని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ నివాసం వద్ద తమ సమస్యలను మంత్రి నుంచి సీఎం కేసీఆర్‌కు వినిపించేందుకు తరలివచ్చారు.
రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదాని భూమన్న యాదవ్, కన్వీనర్ గణేశ్, రాజశేఖర్, శ్రీనివాస్ యాదవ్, మహిపాల్ రెడ్డి, ప్రణయ్ చందర్, ధనలక్ష్మీ, సత్యం పాల్గొని విలేఖరులతో మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో గ్రామాలదే కీలకపాత్ర అని కేసీఆర్ సారధ్యంలో గ్రామాలను అభివృద్ధి దిశలో నడిపించేందుకు సర్పంచ్‌లు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. గతంలో అధికారికి, సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ ఉండేదని, ప్రభుత్వ అధికారిపైనే ప్రభుత్వానికి నమ్మకం లేకుంటే ఎలా అని వారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కేరళ విధానాన్ని తీసుకువస్తామని అంటున్నారని, కేరళలో గ్రామ సచివాలయంలో 14 శాఖల అధికారులు ప్రతి రోజు హజరవుతారని తమకు కూడా14 శాఖల అధికారాలను బదిలీ చేయాలని సూచించారు. అధికారాలు ఇవ్వకుండా సర్పంచ్‌లను సస్పెండ్ చేస్తామని కేసీఆర్ చెప్పడం సబబుగా లేదని, ట్యాక్స్‌లు వసూలు చేసిన డబ్బులు, కేంద్ర ప్రభుత్వం నేరుగా జీపీలకు పంపే 14వ ఆర్థిక సంఘం నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించడం సరికాదని అవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్‌లను జైలుకు పంపుతామనే మాటలను కేసీఆర్ ఉపసంహరించుకోవాలని రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం డిమాండ్ చేసింది. గ్రామాల్లో నేడు సర్పంచ్.. ఒక రేషన్ కార్డు ఇప్పించలేని, పింఛన్ ఇప్పించలేని నిస్సహాయ సిత్థిలో అచేతనుడిగా ఉండిపోతున్నాడని పేర్కొన్నారు. ఉపసర్పంచ్‌లతో కలిసి జాయింట్ చెక్ పవర్‌ను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఎన్నికై ఆరు నెలలు గడుస్తున్నా అధికారాలు కల్పించకపోవడంతో గ్రామాలు నిర్వీర్యమవుతున్నాని వాపోయారు. ప్రభుత్వ ఉద్యోగితో కలిపి జాయింట్ చెక్ పవర్ కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారమయ్యేంత వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం తేల్చి చెప్పింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో సర్పంచ్‌లు మంత్రి ఈటల నివాసం వద్దకు ఉదయమే చేరుకున్నారు. సాయంత్రం వరకు వేచి చూసిన సర్పంచ్‌లు మంత్రి రాకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. సర్పంచ్‌ల సమస్యలపై మాట్లాడేందుకు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధును తన నివాసం వద్దకు మంత్రి రాజేందర్ పంపించగా సర్పంచ్‌లు మాత్రం మంత్రినే కలుస్తామని భీష్మిచండంతో చేసేదిలేక మధు తిరిగి వెళ్లిపోయారు.