రంగారెడ్డి

ప్రమాదపుటంచున విద్యార్థుల ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాచారం, జూలై 23: సరైన వేళల్లో ఆర్టీసీ బస్సుల కొరతతో విద్యార్థులు ప్రమాదపుటంచున ప్రయాణం చేస్తూ గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రమే స్పందిస్తూ చర్యలకు ఉపక్రమిస్తున్నారు. దీంతో పాటు ముందస్తుగానే ప్రమాదాన్ని గుర్తించి నివారణ చర్యలు చేపట్టడంలో ఆర్టీసీ అధికారులు విఫలమవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇబ్రహీంపట్నం నుండి యాచారం మండలం మేడిపల్లి, కడ్తాల్ మండలం పల్లెచెల్కతండ, సరికొండకు వెళ్ళే బస్సులో విద్యార్థులు పరిమితికి మించి ప్రయాణం చేస్తూ ప్రమాదఘంటికలు మోగిస్తున్నారు. గతంలో నగరంలోని జేబీఎస్ నుండి ఇబ్రహీంపట్నంకు ఆర్టీసీ డిపో బస్సుతో పాటు పలు బస్సులు యాచారం మండలం మల్కీజ్‌గూడ, నక్కర్త మేడిపల్లి, కడ్తాల్ మండలం పల్లెచెల్కతండ, సరికొండ ముద్వేని, ఆమన్‌గల్ మండలం ఆకుతోటపల్లి, జంగారెడ్డిపల్లె తదితర గ్రామాలకు బస్సులు నడిచేవి. వాటిని ఆర్టీసీ ఆదాయాన్ని, ప్రయాణీకుల సంఖ్యను సాకుగా చూపి అధికారులు తొలగించారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో ఇబ్రహీంపట్నం నుండి వచ్చే ఆర్టీసీ బస్సులోనే కిక్కిరిసి ప్రయాణం చేస్తూ ఫుట్‌బోర్డులో ప్రమాదకరంగా వేలాడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్పీడ్‌బ్రేకర్లు, గ్రామాల్లోని ఇరుకురోడ్లలో వేలాడుతూ ప్రయాణం చేస్తూ ప్రమాదాన్ని తలపిస్తున్నారు. అదనపు బస్సులు నడపాలని పలుమార్లు అటు హైదరాబాద్, ఇబ్రహీంపట్నం, ఇటు నాగర్‌కర్నూల్ డిపోల ఆర్టీసీ డీవీఎంలకు ఫిర్యాదులు చేసినా, వినతిపత్రాలు సమర్పించినా స్పందించడం లేదని విద్యార్థులు, ప్రయాణికులు వాపోతున్నారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు ముగిసిన వెంటనే, లేదా ప్రారంభానికి ముందు సమయానికి చేరుకునేలా ఆర్టీసీ బస్సులు నడపాలని కోరుతున్నారు.