రంగారెడ్డి

పర్యావరణ పరిరక్షణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోమిన్‌పేట, జూలై 23: పర్యావరణ పరిరక్షణకు హరితహారంలో మొక్కలు నాటి సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని వికారాబాద్ కలెక్టర్ అయేషా మస్రత్ ఖనమ్ అన్నారు. మంగళవారం వె ల్చాల్‌లో ఉపాధి హామీ పథకంలో మొక్కలు నాటేందుకు తవ్వుతున్న గుంతలను ఆకస్మికంగా తనిఖీచేసి పరిశీలించారు. హరితహారంలో నాటిన మొక్కలను రక్షించేందుకు హరితరక్షణ కమిటీలను వేసుకుని లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. ఉపాధి హామీ పథకంలో మంజూరైన పనులను చేయించుకుని ప్రభుత్వ స్థలాలు, పాఠశాలలు, డంపింగ్ యార్డులవద్ద రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని అన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామ కార్యదర్శులు శ్రద్ధ తీసుకుని మొక్కలు నాటాలని అన్నారు. ఎపిఓ శంకర్, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
తుక్కుగూడ అభివృద్ధికి కృషి
* ఎమ్మెల్యే సబితా రెడ్డి
మహేశ్వరం, జూలై 23: తుక్కుగూడ మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాల, సర్ధార్‌నగర్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపనలు చేసారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆర్.జ్ఞానేశ్వర్, ఎంఇఓ కృష్ణ, ఎంపిపి రఘుమారెడ్డి పాల్గొన్నారు.
చెంగిచర్లలో 4న బోనాలు
ఉప్పల్, జూలై 23: బోడుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని చెంగిచర్లలో ఆగస్టు నెల 4న పోచమ్మ బోనాల జాతరను నిర్వహించాలని పట్టణ పెద్దలు తీర్మానించారు. మాజీ ఎంపీటీసీ బింగి భాగ్యమ్మ జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాజీ సర్పంచ్‌లు శంకర్ నాయక్, చందర్ గౌడ్, కొత్త ప్రభాకర్ గౌడ్, సోమేశ్, శ్రీనివాస్, కుర్ర శివ శంకర్, ఏర్పుల వెంకటేశ్, శంకర్, నర్సమ్మ, గారె శ్రీనివాస్ పాల్గొని జాతరను ఘనంగా నిర్వహించాలని తీర్మానించారు.