రంగారెడ్డి

ఆడపడుచులకు పెద్దన్న కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూలై 23: రాష్ట్ర ఆడపడుచుల అపద్భాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. సంక్షేమ పథకాల్లో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ అని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. మంత్రి మాట్లాడుతూ కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకాలు పేద మహిళలకు కొండంత అండగా ఉంటున్నాయని అన్నారు. కల్యాణలక్ష్మీతో పేదింటివారి కష్టాలు తీరుతున్నాయని చెప్పారు. నేడు రాష్ట్రంలోని మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. గోదావరి జలాలు, మిషన్ కాకతీయ, రైతుబంధు వంటి బృహత్తరమైన పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో నీటి కష్టాలు తీరుతాయని వివరించారు. ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని వివరించారు. 28 మంది లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మైనారిటీశాఖ ద్వారా పలువురికి మంజూరైన రుణాల చెక్కులను కూడా మంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. త్వరలోనే మిగతా లబ్ధిదారులందరికీ కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేస్తామని స్థానిక తహశీల్దార్ వెంకట్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్, ఎంపీపీ పద్మ జగన్ రెడ్డి, జడ్పీటీసీ శైలజ విజయానంద్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి సమన్వయకర్త నందారెడ్డి, వైస్ ఎంపీపీ రజిత రాజమల్లా రెడ్డి, ఎంపీడీఓ పద్మావతి, కోఅప్షన్ సభ్యురాలు రుక్సానా బేగం, డబిల్‌పూర్ సర్పంచ్ గీత భాగ్య రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు అంతి రెడ్డి, ఆయా గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.