రంగారెడ్డి

ప్రశాంతంగా ముగిసిన బోనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఆగస్టు 13: బోనాల జాతరలో భాగంగా బోడుప్పల్‌లో నిర్వహించిన శ్రీ బంగారు మైసమ్మ పెద్ద పండుగ ప్రశాంత వాతావరణంలో విజయవంతగా ముగిసింది. రెండు రోజుల పాటు నిర్వహించిన జాతరకు బోనాల ఉత్సవ నిర్వహకులు ఏర్పాటు చేసిన భారీ ఏర్పాట్ల మధ్య వేలాదిగా పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మైసమ్మ తల్లికి మహిళలు బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తుల సుఖ: సంతోషాలు, ఆయురారోగ్యాలతో చల్లంగా చూడాలని తల్లిని ప్రార్ధిస్తూ ఆలయ పూజారులు వంగిపురం అమరనాథాచార్య స్వామి, వీ.శశాంక చార్య స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కన్నుల పండువగా జరిగిన బోనాల జాతరలో మంత్రి మల్లారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు, జడ్పీ చైర్‌పర్సన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, నాయకులు పాల్గొని తల్లి దీవెనలు అందుకున్నారు. జాతర ప్రశాంతంగా ముగిసినందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పండిత సన్మానం ఘనంగా జరిగింది.
ప్రభుత్వ పాఠశాలకు వంట పాత్రలు
ఉప్పల్, ఆగస్టు 13: పీర్జాదిగూడ కార్పోరేషన్ పరిధిలోని మేడిపల్లిలోగ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం వంట పాత్రలు, స్టవ్, ఆట వస్తువులను బిల్డర్ ఎంపాల అనంత రెడ్డి మంగళవారం అందజేశారు. వంట సామాగ్రి లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉచితంగా అందజేసి ఉదాసీనతను వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ నాయకులు జక్క వెంకట్ రెడ్డి, చెరుకు పెంటయ్య, మనోరంజన్ రెడ్డి, నిర్మల, నరేష్, వెంకటేశ్ పాల్గొన్నారు.
న్యాయ విజ్ఞాన, సంక్షేమ పథకాల సదస్సు
ఉప్పల్, ఆగస్టు 13: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం రాష్ట్ర న్యాయ సేవాధికారిత సంస్థ సూచనల మేరకు రంగారెడ్డి జిల్లా సంస్థ ఆధ్వర్యంలో 17న కీసరలో మహా న్యాయ విజాన సంక్షేమ పథకాల సాధికారిత సదస్సు జరుగుతుంది. మంగళవారం సంస్థ సభ్యులు విష్ణు, కళావతి, నవీన, ఆరుణశ్రీ, అనురాధ, పోతురాజు ఉప్పల్ పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో కర పత్రాలను అంటిస్తూ, ప్రజలకు పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ హాజరు కావాలని పేర్కొన్నారు.