రంగారెడ్డి

సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఆగస్టు 14: తెలంగాణలో చిన్నారులపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయని, మహిళలకు భద్రత కరువైందని ప్రభుత్వ పని తీరుకు నిరసనగా భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో బుధవారం రామంతాపూర్‌లో రాస్తారోకో నిర్వహించి అనంతరం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దాడులకు పాల్పడుతున్న దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిఎడల భవిష్యత్‌లో ఆందోళన ఉధృతం చేస్తామని ఎస్‌ఎఫ్‌ఐ మేడ్చల్ జిల్లా కమిటీ సభ్యురాలు అఖిల, ఉపాధ్యక్షుడు శంకర్ హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నేతలు మణికంఠ, చందన, తేజ, శ్రావణి, శైలజ, సాయి, అస్లాం పాల్గొన్నారు.
చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
జీడిమెట్ల, ఆగస్టు 14: చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని బాచుపల్లి సీఐ జగదీశ్వర్ అన్నారు. బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో మెడి కవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో పోలీసులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పీఎస్‌లో సీఐ జగదీశ్వర్‌తో పాటు ఎస్సైలు, సిబ్బందికి వైద్యులు చికిత్సలు చేశారు. జగదీశ్వర్ మాట్లాడుతూ విధినిర్వహణలో ఉండి పోలీసులు వారి ఆరోగ్యాల పట్ల అశ్రద్ధ వహిస్తారని, ఆరోగ్యంగా ఉంటేనే విధులు సక్రమంగా నిర్వర్తించవచ్చని తెలిపారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని చెప్పారు.
గ్రామకంఠం భూమిని రక్షించాలి
కొందుర్గు, ఆగస్టు 14: ఆక్రమణలకు గురవుతున్న గ్రామకంఠం భూమిని రక్షించాలని వీరన్నపేట సర్పంచ్ కుబ్యాబీ పేర్కొన్నారు. బుధవారం జిల్లేడు చౌదరిగూడ ఇన్‌చార్జి ఎంపీడీఓ యాదగిరిగౌడ్‌కు గ్రామకంఠం భూమిని కాపాడాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. సర్పంచ్ కుబ్యాబీ మాట్లాడుతూ వీరన్నపేట గ్రామంలో సుమారు 900 గజాల గ్రామకంఠం భూమి ఉందని, దానికి సంబంధించి కొంతమంది నాయకులు తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించి, దాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. పంచాయతీ కార్యదర్శితో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని, దాంతో పంచాయతీ కార్యదర్శి చౌదరిగూడ పోలీస్‌స్టేషన్‌లో సైతం ఫిర్యాదు చేశారని వివరించారు. గ్రామకంఠం స్థలాన్ని రక్షించడమే కాకుండా, దాన్ని ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
కాలనీ సమస్యలు పరిష్కరించాలి
నార్సింగి, ఆగస్టు 14: హైదర్షాకోట్ శాంతినగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అసోసియేషన్ సభ్యులు కోరారు. బుధవారం హైదర్షాకోట్ గ్రామ మాజీ సర్పంచ్ పూలపల్లి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాలనీ వాసులు బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్, రెవెన్యూ అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. కాలనీ ఏర్పడి దశాబ్ధాలు గడుస్తున్నా కనీస సౌకర్యాలు లేవని, వర్షాలకు రోడ్లు పూర్తిగా గోతులమయంగా మారాయన్నారు. వీధిదీపాలు లేకపోవడంతో రాత్రి సమయంలో ప్రయాణించేందుకు వీలులేకుండా ఉండి తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. వినతిపత్రం అందించిన వారిలో మల్లయ్య, లింగం, మహేందర్, నాగేష్, భాస్కర్ ఉన్నారు.