రంగారెడ్డి

మాజీ సర్పంచ్‌ను కలిసిన ఎంపీ రేవంత్ రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఆగస్టు 14: పీర్జాదిగూడ మాజీ సర్పంచ్‌లు దర్గ సత్తిరెడ్డి, దర్గ బాలమణిని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కలిసి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్‌కు సత్తిరెడ్డి చేసిన సేవలను ప్రశంసించారు. దర్గ మల్లికార్జున్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. సుష్మ రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి సోదర భావాన్ని చాటుకున్నారు. మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తోటకూర జంగయ్య, ప్రభాకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, సందీప్ రెడ్డి, జలంధర్ రెడ్డి, జంగాచారి, భాస్కర్ పాల్గొన్నారు.

డిజిటల్ తరగతులు ప్రారంభం
బొంరాస్‌పేట, ఆగస్టు 14: మండల పరిధిలోని చౌదర్‌పల్లి ఉన్నత పాఠశాలలో బుధవారం వైస్ ఎంపీపీ నారాయణ రెడ్డి, మండల విద్యాధికారి రాంరెడ్డి డిజిటల్ తరగతులను ప్రారంభించారు. డిజిటల్ తరగతుల ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలు సులువుగా అర్థమవడంతో పాటు వినడం, చూడటం వల్ల గుర్తుండి పోతాయని మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నారాయణ రెడ్డి అన్నారు. వంద శాతం అక్షరాస్యత సాధించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందని విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఎంఈవో రాంరెడ్డి మాట్లాడుతూ పెరుగుతున్న సాంకేతిక పరిజానాన్ని ఉపయోగించుకొని ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటమ్మ, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.