రంగారెడ్డి

సంప్రదాయబద్ధంగా రాఖీ పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఆగస్టు 15: అన్నా చేల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ పర్వదినాన్ని గురువారం మేడ్చల్ మండలంలో ఘనంగా జరుపుకున్నారు. మహిళలు తమ సోదరులకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించి సంబరాలు జరుపుకున్నారు. రక్షాబంధన్ పర్వదినాన్ని మేడ్చల్‌లో మతసామరస్యాలకతీతంగా జరుపుకున్నారు.
ఉప్పల్: అన్నా చెల్లెళ్ల మధ్య ఆత్మీయత, అనుబంధానికి రక్షాబంధన్ ప్రతీక. జీవితాంతం తనకు రక్షణగా నిలువాలంటూ సోదరుడికి రాఖీ కట్టి వేడుకుంటుంది సోదరి. రాఖీ పౌర్ణమిగా పిలిచే ఈ రక్షాబంధన్ వేడుకలు గురువారం ఉప్పల్ పరిసర ప్రాంతాలలో సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగాయి. హబ్సిగూడలోని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి కార్యాలయంలో రాఖీ వేడుకలను నిర్వహించారు. టీఆర్‌ఎస్ పీర్జాదిగూడ మహిళా విభాగం నాయకురాలు శేరి సవితా రెడ్డి మహిళలు భార్గవి, శోభా రాణి, సుచిత్ర, శేరి కరుణాకర్ రెడ్డితో కలిసి మంత్రి చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎం.సుధీర్ రెడ్డి, జడ్‌పీ చైర్‌పర్సన్ శరత్ చంద్రా రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకుడు జక్క వెంకట్ రెడ్డికి రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
జీడిమెట్ల: అంతులేని ప్రేమకు చిరునామా అన్నాచెల్లెళ్ల అనుబంధమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ అన్నారు. కుత్బుల్లాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే కేపీ వివేక్‌కు నియోజకవర్గానికి చెందిన మహిళలు రాఖీలను కట్టారు. ఎప్పుడూ ఉండేవైనా ప్రతిసారి కొత్తగానే ఉంటాయని, అలాంటి అక్క, తమ్ముడికి, అన్నా చెల్లెళ్లలందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలను తెలిపారు.
తాండూరు: అన్నా చెల్లెల ప్రేమానురాగాలు అనురాగ బంధానికి ప్రతిక అయిన రాఖీ పౌర్ణమి పర్వ దినం వేడుకలు గురువారం తాండూ రు పట్టణ డివిజన్‌లో ఘనంగా నిర్వహించుకున్నారు. ఇంటింటా అన్నలకు చెల్లెల్లు, తమ్ముళ్లకు అక్కలు రాఖీలు కట్టి తమ ప్రేమానురాగాలను పంచుకున్నారు.
బాలాపూర్: హెల్మెట్, సీటు బెట్లు ధరించకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు గురువారం ఎల్బీనగర్ ట్రాఫిక్ అధనపు సీఐ అంజపల్లి నాగమల్లు అధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు రాఖీలు కట్టించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది వెంకటేష్, సురేష్, బాలు పాల్గొన్నారు.