రంగారెడ్డి

ప్రజలకు సేవలు అందించాలి: మంత్రి మల్లారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, ఆగస్టు 18: మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా రాష్ట్ర మంత్రి మల్లారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. మండల పరిధి చౌదరిగూడ సమీపంలోని చెరుకు బాలయ్య గార్డెన్‌లో జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా జిల్లాలోని పలువురు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు విశిష్ట సేవలు అందించి వారి మన్నలను పొందినప్పుడే జన్మకు సార్ధకత ఉంటుందని చెప్పారు.టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్‌రెడ్డి, సహకార సంఘం చైర్మన్ గొంగళ్ల స్వామి, డైరక్టర్ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు బండారి దాసుగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు బోయపల్లి కొండల్‌రెడ్డి, నాయకులు జగన్మోహన్‌రెడ్డి, సిరాజ్, బర్ల హరిశంకర్ పాల్గొన్నారు.
అనాథాశ్రమానికి బియ్యం విరాళం
వనస్థలిపురం, ఆగస్టు 18: వనస్థలిపురం శ్రీనివాసపురంలోని నాగార్జున మాంటీస్సోరీ, ఐఐటీ ఒలింపియాడ్ హైస్కూల్ విద్యార్థులు వివేకానంద అనాథాశ్రమానికి ఆరు క్వింటళ్ల బియ్యం, ఒక క్వింటాల్ కంది పప్పును విరాళంగా అందజేశారు. ఇటీవల పాఠశాలలో నిర్వహించిన చారిటీడే సందర్భంగా విద్యార్థుల నుంచి సేకరించిన సరుకులతో పాటు యజమాన్యం మరికొంత కలిపి ఆశ్రమానికి విరాళంగా అందజేశారు. పాఠశాల చైర్మన్ జీ.విఠల్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఏడు ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విద్యార్థులు వెల్లడించారు. విద్యాసంస్థల వైస్ చైర్మన్ జీ.రజిని విఠల్‌రెడ్డి, సీఏఓ ఎ.శేషారావు, అకడామిక్ డీన్ ఎస్.రాజశేఖర్, వైస్ ప్రిన్సిపాల్ ఎ.లక్ష్మీ పాల్గొన్నారు.
శ్రీ వాసవి వైశ్య సంఘం కమిటీ అధ్యక్షుడిగా విశే్వశ్వర్
ఉప్పల్, ఆగస్టు 18: బోడుప్పల్‌లోని శ్రీ వాసవీ వైశ్య సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడు పొద్దుటూరి నర్సింగ్ రావు గుప్త ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో కమిటీ అధ్యక్షుడిగా జీ.విశే్వశ్వరయ్య, ప్రధాన కార్యదర్శిగా బీ.రవి, కోశాధికారి పీ.సంతోష్, సలహాదారులుగా బీ.శ్రీనివాస్, 45 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. రాబోయే రెండేళ్ల పాటు వీరి పదవీ కాలం ఉంటుందన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, కిష్టయ్య, బానోజి రావు పాల్గొన్నారు.