రంగారెడ్డి

నిరసనలతో ప్రభుత్వం కళ్లు తెరిపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఆగస్టు 18: రైతు సమస్యలపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు చేసి ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీ.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. మాట్లాడుతూ కొత్త పాసుపుస్తకాల పేరుతో రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సగానికి పైగా రైతులకు కొత్త పాసుపుస్తకాలు రాలేవని, అదే సాకుతో రైతుబంధు కూడా ఇవ్వలేరని తెలిపారు. ఇచ్చిన పాసుపుస్తకాలు తప్పుల తడకలే అని ఆరోపించారు. రుణ మాఫీ సైతం నేటికి అమలు చేయకపోవడంతో బ్యాంకుల్లో కొత్త రుణం పుట్టక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలోజిల్లా అధికార ప్రతినిధి జే.రత్నారెడ్డి, పట్టణ అధ్యక్షులు సుధాకర్‌రెడ్డి, ఎ బ్లాక్ అధ్యక్షులు అనంత్‌రెడ్డి ఉన్నారు.

చీర్యాల టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా రమేష్
కీసర, ఆగస్టు 18: టీఆర్‌ఎస్ చీర్యాల గ్రామ శాఖ అధ్యక్షులుగా బర్లపాటి రమేశ్‌ను కీసర మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు జలాల్‌పురం సుధాకర్ రెడ్డి నియమించారు. ఆదివారం సుధాకర్ రెడ్డి కార్యవర్గాన్ని నియమించారు. ఉపాధ్యక్షులుగా మొగుళ్ల రాజిరెడ్డి, బత్తుల బాలకృష్ణ, యంజాల సత్యనారాణ, ప్రధాన కార్యదర్శిగా పూస శ్రీ్ధర్, కార్యదర్శులుగా గోపాల్, ప్రచార కార్యదర్శిగా తాళ్ల రవి, కోశాధికారిగా సింగిరెడ్డి నాగార్జునరెడ్డి, యువజన విభాగం అధ్యక్షులుగా రామిడి ప్రేమ్‌కుమార్ రెడ్డి, కార్యదర్శిగా మల్లారపు శివసాయిలను నియమించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, మల్లారపు లక్ష్మీనారాయణ, బోడ లింగం పాల్గొన్నారు.