రంగారెడ్డి

సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర ఎంతో గొప్పది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఆగస్టు 18: పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుతో శాశ్వత నీటి సమస్య పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ వివరించారు. ఆదివారం ఫరూఖ్‌నగర్ మండలం కిషన్‌నగర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 369వ జయంతి సందర్భంగా సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను గౌడ సంఘం నాయకులు, టీఆర్‌ఎస్ నాయకులు పెద్దఎత్తున సన్మానించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును నిర్మించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని, రానున్న మూడేళ్లల్లో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నారని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రతిపక్ష పార్టీల నాయకులు అసత్య ఆరోపణలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధియే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని అన్నారు. పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి అనేక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ మాట్లాడుతూ అన్ని వర్గాల పేద ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశారని, తెలంగాణ కీర్తి కోసం పాటుపడిన మహావ్యక్తి సర్థార్ సర్వాయి పాపన్న అని గుర్తు చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గౌడ సంఘాలకు ప్రత్యేకంగా ఈత చెట్లు సరఫరా చేస్తున్నామని, వాటిని ఎక్కువగా చెరువుకట్టలపై, వాగుల వంకలపై నాటి రక్షించే బాధ్యత గౌడ సంఘం నాయకులు తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి, ఫరూఖ్‌నగర్ ఎంపీపీ ఇద్రీస్, జడ్పీటీసీ పీ.వెంకట్‌రాంరెడ్డి, మాజీ ఎంపీపీలు రంగయ్య గౌడ్, శివశంకర్ గౌడ్, నేతలు మద్ధూరి అశోక్‌గౌడ్, కిషన్‌నగర్ సర్పంచ్ శ్రీశైలం యాదవ్, ఎంపీటీసీ సభ్యుడు శివరాజ్ యాదవ్, నరేందర్, చేగూరి రాఘవేందర్‌గౌడ్ పాల్గొన్నారు.

పండుగలను ఘనంగా జరుపుకోవాలి
*పోచమ్మ బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే మంచిరెడ్డి
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 18: రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దంపట్టే పండుగలను ఘనంగా జరుపుకొని, వాటికి కట్టుబడి ఉండాలని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక పోచమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా శివసత్తులు, డప్పువాయిద్యాలు, పోతురాజుల విన్యాసాల నడుమ భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఆలయ కమిటీ చైర్మన్ ముత్యాల భాస్కర్, మాజీ కౌన్సిలర్ ఆకుల యాదగిరి, టీఆర్‌ఎస్వీ నాయకులు జేర్కొని రాజు, శివసాయి పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడలో జరిగిన పోచమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులతో కలిసి బోనాలు సమర్పించేందుకు ఊరేగింపుగా వెళ్లారు. పోచమ్మతల్లి దయతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు. పూజల్లో జడ్పీటీసీ భూపతిగళ్ల మహిపాల్, మాజీ ఎంపీపీ మర్రి నిరంజన్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.